దాసరి మోహన్ కవిత : ప్రాంక్... ప్రాంక్

By Arun Kumar P  |  First Published Dec 11, 2022, 9:03 AM IST

బంధాలు కారణాలు అల్లు తున్నాయి అనుబంధాలు అన్ని ప్రాంక్ ప్రాంక్ అంటూ దాసరి మోహన్ రాసిన కవిత  " ప్రాంక్... ప్రాంక్ " ఇక్కడ చదవండి. 
 


ఆమె సెలయేరు లా నవ్వుతుంటే
నేను సమయాన్ని అంకితం చేశాను
పెళ్లి ప్రయత్నానికి  ప్రపోజల్ పెడితే 
ప్రాంక్ ప్రాంక్ ప్రేమంతా ప్రాంక్ అంది

మూడు ముళ్లు మంగళ వాయిద్యాలు
ఏడు అడుగులు ఎన్నో బాసలు
అరుంధతీ లేదు ఆనందం లేదు
సంసారం లో  సుఖం ప్రాంక్ ప్రాంక్

Latest Videos

undefined

పట్టు తప్పి పడిపోయినప్పుడు
చుట్టు ముట్టు నవ్వులే నవ్వులు
చేయి అందించి చేరదీసింది లేదు
సిట్టింగుల కే పరిమితం స్నేహం ప్రాంక్ ప్రాంక్ 

కుప్పకూలి మంచాన పడితే
కొడుకు రాడు కూతురు రాలేదు
బంధాలు కారణాలు అల్లు తున్నాయి
అనుబంధాలు అన్ని  ప్రాంక్ ప్రాంక్

మైకు ముందు ఆశలు కుమ్మరిస్తే
ఓటు వేసి కుర్చీ మీద కూచో బెట్టా
మంచి చేయమని గుర్తు చేసి నిలదీస్తే
ప్రాంక్ ప్రాంక్ హామీ లన్నీ ప్రాంక్ ప్రాంక్ 

ప్రాంక్ కాలం ప్రపంచం
కొన్ని కెమెరాల ముందు
లెక్కలేనన్ని తెర వెనకాల 
ప్రాక్టికల్ గా బతకడం నేర్చుకోవాల్సిందే....
 

click me!