నేడు సత్యము మరి రేపటిది ఊహ అంటూ అహోబిలం ప్రభాకర్ రాసిన కవిత " నిండుదనము " ఇక్కడ చదవండి :
గత నాలుగు రోజులు
సరదా మిగిల్చి నప్పుడు
మన స్వీయ దర్శనము
ఎంత నిర్మలముగా వుంటుంది
ఇంకా ఏ ప్రదర్శనకు తావుండదు,
అప్పుడప్పుడు తప్పిపోయిన
ఆత్మగల్ల తనం
ప్రతీ శుభోదయాలు
ఆ తృప్తి కై వెతుకులాట
ఎన్నో ఆటలు బతుకుల నిండా
మనసు జార్చుకోవడం
తప్పని స్థితి
నిన్నటి అబద్ధం
నేడు సత్యము
మరి రేపటిది ఊహ
ఎప్పుడూ కొత్తగా పులుముకునుడు
తొలి పలకరింపు మీదే సవారి
ఎవరిని ఎవరు మోస్తున్నరు
ఏ ప్రయాసకు ఆ సంతృప్తి
నాలుగు పదాలు రాలుస్తుంది
అది చాలాదా ఈ రోజుకు