నేడు ఎన్ యెస్ యెస్. డే సందర్భంగా జయహో భారత్ జయహో ఎన్ యెస్ యెస్. అంటూ జాతీయ సేవా పథకం బెస్ట్ ప్రోగ్రాం ఆఫీసర్ గా రాష్ట్ర పురస్కారం పొందిన డా.చీదెళ్ళ సీతాలక్ష్మి రాసిన కవిత " అభివృద్ధి బాటలు " ఇక్కడ చదవండి :
అభివృద్ధి పథంలో పయనం
యువకుల్లో ఉత్సాహం
విద్యార్థులకు ప్రోత్సాహం
జాతీయ సేవాపథకం
అదే అదే అదే ఎన్ యెస్ యెస్!!
నాకోసం కాదు మీకోసం
అనే నినాదంతో
సేవ చేయడమే పరమ లక్ష్యం
క్రమశిక్షణకు మారుపేరు
రెండువేల పందొమ్మిదిలో
జరుపుకుంది స్వర్ణోత్సవం!!
జూనియర్ కళాశాల నుండి
విశ్వవిద్యాలయం వరకు
శాఖోపక్షాఖలుగా విస్తరించి
అందిస్తున్న సేవ అద్భుతం!!
గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి
మద్యం తాగుడు పొగ తాగుడు నష్టాలు కోకొల్లలు
ఇల్లు ఒళ్ళు గుల్ల
మందు కోసం ముందుకెళ్ళ
మందు వాడి ఆరోగ్యం వెనకెళ్ళు
ఆ మందు ఈ మందుకు డబ్బు
రెండు విధాలా నష్టం!!
ఎన్నో ఎన్నెన్నో
శిబిరాలు ఏర్పాటు
అవగాహన కలిగిస్తూ
చైతన్యం పెపొందిస్తూ
పాటలు ఆటలతో
పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ
ఎక్కపడితే అక్కడ ఉమ్మొద్దు
మలమూత్రాలు చేయొద్దు
స్వచ్ఛ భారత్ కు చేయూత
అందరమిద్దాం ఊత
పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు
పర్యావరణ పరిరక్షణలో ముందుకు వెళ్ళు
ఆడపిల్లల చదువు అవనికి వెలుగు
సుకన్యా సంయోజన్ ఆవశ్యకత
ఆడపిల్ల పట్ల చూపాలి అనురాగం
పెళ్లీడు వస్తేనే పెళ్లి
లేకుంటే జీవితమంతా లొల్లి!!
వృద్ధులు కన్నవారిపట్ల
దయ జాలి చూపిస్తూ
సేవా దృక్పథాన్ని కలిగి
సహాయం చేస్తూ ప్రేమను కురిపిస్తూ
ఆదర్శంగా నిలవాలి!!
ఓటు హక్కు ప్రాధాన్యత
ఆరోగ్య చెకప్ లు రక్తదానం చేయడంలో
మనవంతు బాధ్యత
నీటిని వృధా చేయొద్దని హెచ్చరికలు చేసే
ఎన్ యెస్ యెస్ కార్యకర్తలు
చేసే గొప్ప గొప్ప పనులు
బద్దకానికి వీడ్కోలు
దేశాభివృద్ధికి బాటలు
సంతోషానికి మూటలు!!
జయహో భారత్
జయహో ఎన్ యెస్ యెస్.