అమ్మంగి వేణుగోపాల్ కవిత : గోల్ గోల్

Published : Dec 18, 2022, 09:14 AM ISTUpdated : Dec 18, 2022, 09:44 AM IST
అమ్మంగి వేణుగోపాల్ కవిత :  గోల్ గోల్

సారాంశం

ప్రపంచం మొత్తాన్ని ఊపేస్తున్న ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్ నేడే.  ఈ సందర్భంగా అమ్మంగి వేణుగోపాల్ రాసిన ఆసక్తికరమైన కవిత  " గోల్ గోల్ " ఇక్కడ చదవండి:  

గోల్ గోల్ ఏ దునియా గోల్
వరల్డ్ కప్ సాకర్ ఫైనల్
హోరెత్తే మహా స్టేడియం
సంచలనాల క్రీడా ప్రపంచం
అన్ని దేశాలు, అన్ని జాతులు
క్రీడా స్ఫూర్తితో ఎగిరే పతాకలు
భూమిలాగా గుండ్రని బంతి
ఓడిపోయినా ఓం శాంతి
ఈ గ్రౌండ్ దీర్ఘ చతురస్రం
ఆశలేమో అజస్ర సహస్రం
కిరీటం కోసం పోరాటం
మృత్యువుతో చెలగాటం
ఓటమి సాక్షిగా గెలుపే లక్ష్యం
అది ఏ ఒక్కరినో వరించే భాగ్యం
పీలే మరెడోనా రొనాల్డిన్హో
చరిత్రలోని నిన్నటి పుటలు
రొనాల్డో నేమార్ లు ముగిసిన కథలు
మెస్సీకిది చివరి అంకం
జూలియన్ ఎంబప్పే లు కొత్త వీరులు
కార్నర్ పెనాల్టీ కిక్
ఫీల్డ్ గోల్ షూటౌట్
కాలం కంటే క్షణం ముందు
గెలుపు రాగంతో మెరుపు వేగంతో
రక్కసి కసితో కాల్బలంతో
పిడుగై విరుచుకుపడితే గోల్
ఇంతకూ....
అర్జెంటీనా నా? ఫ్రాంన్సా ??
ఇది సమవుజ్జీల విశ్వయుద్ధం
కాలం షీల్డ్ కవర్ లో ఫలితం !
 

PREV
click me!

Recommended Stories

Tim Cook books టిమ్ కుక్ ని మార్చేసిన పుస్తకాలు.. చదివితే మనకూ స్ఫూర్తి పాఠాలు
అపరాజిత అయోధ్య : రామాలయ చరిత్ర, శతాబ్దాల పోరాటం