ఓట్ల గాలెం వేస్తు ఉన్నరు కోట్ల సంపాదన కొరకు/ పైరవేమో చూపుతున్నరు అని అంటున్నాడు తెలుగు కవి యరకల యాదయ్య.
ఓట్ల గాలెం వేస్తు ఉన్నరు కోట్ల సంపాదన కొరకు
పైరవేమో చూపుతున్నరు
సీటు కొరకు పోటీపడుతు
కాళ్ళు వేళ్ళు పడుతున్నరు ముష్టి యుద్ధం చేస్తున్నరు
ఓటు వేసిన ప్రతిసారి మోసపోవుటే ప్రజల వంతు
గెలిచిన ప్రతిసారి కూడ పెట్టుటే నాయకుల తంతు
ప్రజల సొమ్ముతో ప్రజలకొరకు
కుర్చీలల్లో కూర్చుండ బెట్టిన
సర్కారు కొలువుదారులు
పైరాబడి లేకుంటే సంతకమే కదలదంట
ఆన్ లైన్ దరకాస్తు చేస్తే
మైక్రో నైజ్డ్ సమస్యను చూపి
లంచమిస్తే ఒకే నంట లేదంటే
కంప్యూటర్ ఒప్పుకోదంట
ఒకరిని ఇంకొకరు దోచుకొనేదే
మనుషుల మనుగడేనట
మనకన్నామూగప్రాణులే నయం
వాటికొకటే ప్రాణ భయం
అన్నీటిలో మనకన్నా అవే నయం.
అవినీతి లేని పాలన
ఎప్పుడొస్తదోనని కలగందున
కష్టమంత మరచిపోయి
కలల లొనే తృప్తి పడుదున.