ఎస్. భూపాల్ రెడ్డి తెలుగు కవిత: పోగాలం

By telugu team  |  First Published Apr 6, 2020, 8:52 AM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తోంది. మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఈ స్థితిలో జీవిత సత్యాలను ఆవిష్కరిస్తూ ఎస్ భూపాల్ రెడ్డి పోగాలం అనే కవిత రాశారు.


ప్రాణమంటే ఎంత తీపి 
దేహమంటే ఎంత ప్రీతి !!

రాజ్యాలు కూడబెట్టినా 
ధనధాన్యాలు దాచినా 
ఆస్తులు పోగేసినా 
అధికారం అందివచ్చినా 
ప్రాణాలకు అడ్డొచ్చాయా 
జివితం నిలబెట్టాయా !!

Latest Videos

అన్నీ బాగున్నప్పుడు ఆగకపోతిమి 
మనంతటోడు ఇంక లేడంటిమి 
మనకెవ్వరూ లెక్ఖ లేదంటిమి 
ఇక డబ్బే సర్వస్వమంటిమి !!

ధనధాన్యాదులెక్కడికి పాయె 
డబ్బూ దర్పములేమయిపాయె 
మనిషినేవీ రక్షించక పాయె 
మనముండగనే మాయమైపోయె!!

కాన మనిషిని ప్రేమించవోయి 
సాటి మనసును ధ్వేషించకోయి 
స్నేహమే నీకు ఆసరానోయి 
సంతోశమే నీకు మిగులునోయి !!

మరింత సాహిత్యం కోసం క్లిక్ చేయండి: https://telugu.asianetnews.com/topic/literature

click me!