ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తోంది. ఈ స్థితిలో తెలుగు కవులు కరోనా వైరస్ కు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రముఖ కవి డా. ఎన్ గోపి కరోనా వైరస్ పై ఓ కవిత రాశారు.
రోగాన్ని దాచుకోవద్ద
అదేమన్న అపరాధమా!
పాములు అంతటా తిరుగుతుంటాయి
అవి ఎవరినైనా కాటేయ్యొచ్చు
నిబ్బరాన్ని ఎదురెక్కించి
విషాన్ని విరిచెయ్యటమే కర్తవ్యం
రోగ వార్తను
అందరితో పంచుకోవాలి
టాం టాం వెయ్యాలి.
అదేమన్నా స్వీయదోషమా!
ప్రస్తుతానికి మన శరీరమొక మజిలీ
మన వారికి దూరంగా
జరగటమే కావాలి.
మజిలీలోనే దాన్ని మట్టుపెట్టాలి.
రోగానికి మతం లేదు.. గతం లేదు
బీదా లేదు హోదా లేదు
ఒక సర్వసమానత్వం సిద్ధాంతం
రాద్ధాంతం వద్దు
ఐక్యతే మన యేకాంతం
మనకు రాలేదు కదా
అనే శాడిజం వద్దు
మనం దొరలేదంతే
వైరస్ ను పాజిటివ్ గా చూడండి
నెగెటివ్ ప్రభలవతో
వెలికి వస్తారు చూస్కోండి
మంచికో చెడ్డకో
కరోనా మేల్కొలిపింది మనల్ని
రేపు ఇంతకన్నా మంచి
స్వాస్థ్యజగత్తును సృష్టిద్దాం.
ప్రాణాలకు తెగించి
పోరాడే వైద్యులకు నమస్కరిద్దాం
రోగం నిరాశ కాదు
ఒక ఆశావహ నిరోధం
రోగాన్ని ఎలుగత్తి చాటుదాం
ఈ విపత్తును ధైర్యంతో దాటుదాం
మరింత సాహిత్యం కోసం క్లిక్ చేయండి:https://telugu.asianetnews.com/topic/literature