ప్రమోద్ ఆవంచ కవిత: నువ్వు వస్తావు కదూ

By telugu team  |  First Published Nov 23, 2019, 4:08 PM IST

తెలుగు సాహిత్యంలో కవిత్వానికి విశేషమైన స్థానం ఉంది. ప్రమోద్ అవంచ రాసిన నువ్వు వస్తావ్ కదూ కవితను మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం.


మేఘాలతో చెప్పి ఆకాశాన్ని
కప్పుకోమని చెపుతా

అప్పుడప్పుడు వచ్చే
మెరుపులకు చెప్పి నీ
దారి పొడవునా వెలుగులు
పరచమని, చెపుతా

Latest Videos

పిడుగు తో చెప్పి శబ్దం
తక్కువగా చేయమని
చెపుతా

వరుణుడుతో చెప్పి
సన్నటి జల్లులను
కురిపించమని
చెపుతా

ఆకాశంతో చెప్పి ప్రకృతిని
అంతా నీ అధీనంలోకి
ఇవ్వమని చెపుతా

చీకటిగా వుందంటావా
అవును
నీకు చీకటంటే భయం
కదా

పౌర్ణమి చంద్రుడికి చెప్పి
నీకోసం నక్షత్రాల పల్లకి
పంపమని చెపుతా

నువ్వు వస్తావు
కదూ.....

నన్ను పలకరించి పోతావు
కదూ.....

click me!