మోహన్ రుషి కవిత: సిల్వర్ లైనింగ్

By telugu team  |  First Published Dec 13, 2019, 12:50 PM IST

తెలుగు కవిత్వ ప్రక్రియలో మోహన్ రుషికి ప్రత్యేకమైన స్థానం ఉంది. మోహన్ రుషి రాసిన సిల్వర్ లైనింగ్ కవితను ఏషియా నెట్ న్యూస్ పాఠకుల కోసం అందిస్తున్నాం.


చీము కారుతూ వుండేది. చికాకు పెడ్తూ వుండేది.

తగు జాగ్రత్తలతో మెలగాల్సి వచ్చేది. తరచుగా కాటన్ దొర కాళ్ళు మొక్కాల్సి వచ్చేది.

Latest Videos

ఖాళీగా వుండడం వల్ల అనుకుంటా, అనేకానేక
కంప్లైంట్లు చేసేది. అటూఇటుగా ఆర్నెళ్ళకోసారైనా ధన్వంతరి వారసులకు ధనం సమర్పించాల్సి వచ్చేది.

తావీదు మహిమలా అనుభవంలోకి వచ్చింది. మొబైల్ ఫోన్ వాడకంతో జరిగిన మొదటి మేలులా అనిపిస్తోంది.

చెవి ఎండిపోయింది!

మరింత తెలుగు సాహిత్యం కోసం క్లిక్ చేయండి: https://telugu.asianetnews.com/literature
 

click me!