కాంచనపల్లి రాజేంద్ర రాజు తెలుగు సాహిత్యంలో పేరున్న కవి. ఆయన ఏషియా నెట్ న్యూస్ కోసం రాసిన కవితను పాఠకులకు అందిస్తున్నాం.
తెలుసుకో......
ఇప్పుడే
కచ్చితంగా తేల్చుకో.....
ఎంత ప్రేమిస్తావో
అంత విలపిస్తావ్
నీది కానిది
నీలో లేనిది ఏదైనా సరే
నువ్వు ప్రేమించకు
నీ ఇష్టాన్ని.... ప్రేమను అవసరంగా మాత్రమే గుర్తించు
నీది కానిది.... నీలో లేనిది
సంతలో సరుకులా భావించు
ఏది మొదటి నుండి నీది కాదు
ఏది చివరి వరకు నీది కాదు
మద్యలో వచ్చి
మద్యలో పోయే వాటి గురించి
నీ ఆది అంతాలను ముగించకు
ముగించాల్సి వచ్చినా సరే.......
........ ....,. .....
ఇంతకీ
ఇదంతా ఎప్పుడుమొదలైందోతెలుసా
నిన్ను నువ్వు ప్రేమించుకోవడం మానేసినప్పుడు
నిన్ను నువ్వు అంకితం చేసుకున్నప్పుడు
నీకై నువ్వు దాసోహం అయినప్పుడు
నీలో లేనిది.... నీది కానిది నువ్వు ఎక్కువగా ప్రేమించినప్పుడు.
నువ్వు ఎప్పుడైతే
నిన్ను నువ్వు కోల్పోవడం మొదలైందో
అప్పుడే
. నీకు *విలపించడంఅలవాటయిది
నిన్ను నువ్వు ప్రేమించుకున్నప్పుడు....
ఓడిపోవు.
నిన్ను నువ్వు గెలిపించుకున్నప్పడు....
విలపించవు.
- కాంచనపల్లి రాజేంద్ర రాజు
మరింత సాహిత్యం కోసం క్లిక్ చేయండి: https://telugu.asianetnews.com/literature