సాధారణ పాఠకులు,సాహిత్య అభిలాష ఉన్నవాళ్లు గొల్లపూడి రచనలపై స్పందించడం, వాటిని మెచ్చుకోవడం సహజమే కావచ్చు... కానీ ఓ జైలు జీవితం అనుభవిస్తున్న ఖైదీ కూడా ఆయన నవలను చదివి అభిమానించడం... అక్కడితో ఆగకుండా దానిపై ఆయనకో లేఖ రాయడం చాలా అరుదైన విషయం.
ప్రముఖ నటుడు,రచయిత వ్యాఖ్యాత గొల్లపూడి మారుతీరావు అనారోగ్యంతో ఇందాక కొద్దిసేపటి కింద చెన్నై లోని ఆసుపత్రిలో కన్నుమూశారు. గొల్లపూడి మృతితో తెలుగు ప్రజలంతా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. చిత్ర పరిశ్రమ అయితే మరో పెద్ద దిక్కును కోల్పోయినట్టయిందని కన్నీరు మున్నీరవుతుంది .
నటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమపై ఎంతటి ముద్ర వేశారో.. అంతే స్థాయిలో నాటక, కళా సాహిత్య రంగాలపై కూడా వేశారు. రచయితగా,నవలకారుడిగా తెలుగు సాహిత్యం కోసం గొల్లపూడి మారుతీరావు ఇతోధికంగా కృషి చేసారు.
Also read; జర్నలిస్టుగా గొల్లపూడి... అప్పట్లోనే గడగడలాడించాడు
ఆయన రాసిన నవాళ్లకు అనేక మంది అభిమానులను ఆయనకు సాధించిపెట్టాయి. ఆయన ఎక్కడైనా బయట కనపడితే అప్పట్లో ఆయన ఆటోగ్రాఫ్ లకోసం జనాలు ఎగబడేవారు. ఆయన నవల విడుదలైన తరువాత ఆయన ఇంటికి పుంఖానుపుంఖాలుగా లేఖలు వచ్చిపడుతుండేవంటి అతిశయోక్తి కాదు.
అప్పట్లో ఆయన రచించిన 'సాయంకాలమైంది' అనే నవల ఆయనకు ఎంతోమంది సాహిత్య అభిమానులను సంపాదించి పెట్టింది. మాజీ ప్రధాని పీవి నరసింహారావు మొదలు ఎందరో పాఠకులు,సాహితీవేత్తలు, సాహిత్య అభిమానులు, పాఠకులు, విమర్శకులు ఆ నవలను ప్రశంసించారు.
సాధారణ పాఠకులు,సాహిత్య అభిలాష ఉన్నవాళ్లు గొల్లపూడి రచనలపై స్పందించడం, వాటిని మెచ్చుకోవడం సహజమే కావచ్చు... కానీ ఓ జైలు జీవితం అనుభవిస్తున్న ఖైదీ కూడా ఆయన నవలను చదివి అభిమానించడం... అక్కడితో ఆగకుండా దానిపై ఆయనకో లేఖ రాయడం చాలా అరుదైన విషయం.
చిన్నప్పుడు పాఠశాల స్థాయిలో తెలుగు సందర్భాలు రాసే సమయంలో కవిపరిచయం రాస్తున్నప్పుడు... ప్రతి విద్యార్ధి, ఆ సదరు కవి రచనలు ఎలా ఉన్నా.. పరీక్షలో మాత్రం కవి రచనలు పండిత పామర జనరంజకంగా ఉండేవి అని రాసేవాడు. ఇక్కడ మాత్రం ఆ విషయం నిజంగా నిజమైంది.
Also read; గొల్లపూడి జీవితంలో విషాద ఘటన.. అజిత్ తో సినిమా తీస్తూ కుమారుడి మృతి
ఇక గొల్లపూడి రచనను మెచ్చుకుంటూ లేఖ రాసిన ఖైదీ మరెవరో కాదు... పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడైన జూలకంటి శ్రీనివాస్ రెడ్డి అలియాస్ మొద్దు శ్రీను.'అతను లేఖ రాయడం మాత్రమే కాదు, తనని తాను గొల్లపూడి శిష్యుడిగా ప్రకటించుకున్నాడు.
విప్లవం అంటే గతంలో ఆయుధాలతో అడవుల్లో తిరిగేవారు చేసే పని అని ఒక అభిప్రాయం ఉండేది నాకు. మీరు మీ మీ ఆయుధాలతో సమాజాన్ని కొత్తగానయినా చక్కటి బాటలో నడిపిస్తున్నారు. అందుకు గురువు గారైన మీకు,మీ అనుమతి లేకుండానే మీ శిష్యుడిగా ప్రకటించుకుంటున్నాను.'అని ఆ లేఖలో పేర్కొన్నాడు ఈ ఏకలవ్య శిష్యుడు మొద్దు శీను.