తెలుగు సాహిత్యంలో తెలుగు కవిత్వం స్థానం ప్రత్యేకమైంది. మడిపల్లి రాజ్ కుమార్ రాసిన చలిపిడుగు కవితను మీ కోసం అందిస్తున్నాం.
కొమ్మలు
కొమ్మల మీదున్న కొంగలె కాదు
ఆకులు సుత కట్టె తరుచుకు పోతయి
చెట్టు చేమ సమస్తమూ
చలికుంచె గీసిన
నిర్మల పెయింటింగు మాదిరే
మంచుసూది
నోర్లు కుట్టేసుంటది
కీసుకీసు పిట్టైన
కిమ్మంటె ఒట్టు
జీవప్రపంచం ఒళ్ళంత
కొరుక్కుతినే చలి
పొగమంచు పంజాపులి
పొద్దు పొద్దున్నే
ఏ కంట్లె చూడు మోతెబిందులే
చూపుల నిండ
తెల్లపొరలు
ఇది కండ్లబీమారి కాదు
కాలం రోగం
ఈ చలి పురుషుని ముందర
ఎంత తీస్ మార్కానైనా
చేతులు కట్టుకోని
గజగజ వణుకుడే
ఏడు దిక్కులు...కిందా మీద
అన్ని కట్టెల మోపుగ ఆ తూరుపుకు
సాగిలబడుతయి
అగ్గి రాజేయ!
మరింత సాహత్యం కోసం క్లిక్ చేయండి: https://telugu.asianetnews.com/literature