ప్రవీణ్ కుమార్ దైవఙ్నాచార్య కవిత: ప్రేమ - దారి...

By telugu team  |  First Published Dec 14, 2019, 4:01 PM IST

ప్రముఖ కన్నడ కవి ప్రవీణ్ కుమార్ దైవఙ్నాచార్య రాసిన కవితను ఎస్డీ కుమార్ తెలుగులో అందించారు. ఆ కవితను ఏషియా నెట్ న్యూస్ పాఠకుల కోసం అందిస్తున్నాం. 


లాటీను పట్టుకునెళుతున్నావు నువ్వు 
నీ వెనక నేను 
ఆయాసంతో రొప్పుతున్న వెలుగు -
ఇద్దరమూ నడిచే వేగానికి మరియు దూరానికి 

ఈ రాత్రి నడచిన దూరాన్ని 
రేపు తప్పక వెన్నంటి 
దాఖలాచేస్తుంది నా వీపు మీద 
ప్రేమ నడిపించిన విషాదభరిత అట్లాస్   దారుల్ని 

Latest Videos

ప్రియ సఖి 
అందరూ నడయాడి వచ్చే ఈ దారిలో 
రాళ్ళు రప్పలను మనమే పేరిస్తూ పోవాలి 
మరియు 
మన పాదాల రక్తాన్ని మనమే 
తుడిచి ములాము 
పూసుకొంటుండాలి

కన్నడం : శ్రీ ప్రవీణ్ కుమార్ దైవఙ్నాచార్య 
తెలుగు : ఎస్.డి.కుమార్

click me!