ప్రాణాంతకమైన కరోనా వైరస్ వ్యాధి ప్రపంచమంతా వ్యాపిస్తున్న తరుణంలో దానిపై యుద్ధం చేయాల్సిన అవసరాన్ని తెలుగు కవులు చెబుతున్నారు. స్వీయ నిర్బందం ఆవశ్యకత గురించి ద్వారకామాయి బత్తుల కవిత్వం చెబుతోంది.
అనుకున్నవా
అసలు కలగన్నవా
ధైనందిన కార్యం
సాగకుండా ఇలా
ఆగుతుందనీ.
కాలం స్తంభించినా
ఆపని పనులు
చచ్చినట్టు ఆపి
బతుకుతున్నం.
undefined
నర నరాలలో
కరోనా కలవరం
లెక్కలేని సంఖ్యల్లో
జనాల మరణం.
స్వయం నియంత్రణతో
కోవిడ్ ని తరిమేద్దాం.
గృహ నిర్భందనను
పాటిస్తూ ప్రభుత్వానికి
సహకరిద్దాం.
నిత్యం మనకోసం
అప్రమత్తత తో
రక్షణాధికారులు ,
వైద్య సిబ్బంది మనకే ఇబ్బంది
లేకుండా నిరంతర
సేవలందిస్తున్నారు.
తిరిగి వారికి ఏమివ్వక్కర్లేదు
తింటూ నీ ఇంటిని స్వచ్ఛంగా
కాపాడుకుంటే నువ్వే తోపు.
తెలియజెప్పు తోటి వారికి
తోడు వద్దు, తిరుగుట రద్దు.
మొద్దులైనా పర్లేదు, ఇంటి ప్రహరీ గోడలే నీకు సరిహద్దు.
ప్రకృతిని తన రేఖా చిత్రాల్లో, ఛాయా చిత్రాల్లో బంధించడమే కాకుండా అద్భుతమైన భావాల్ని అక్షరాలుగా మలిచి కవితలుగా కూర్చగల మంచి నేర్పున్న యువ కవయిత్రి. మంచిర్యాల జిల్లా ముత్యంపేట అనే గ్రామంలో ప్రకృతి అందాల మధ్య ఎదిగి, హైదరాబాద్ పట్టణ వాసంలో సాంకేతిక విద్యతో ఎదుగుతున్న రేపటి తరపు స్ఫూర్తి. పేరు ద్వారకామాయి బత్తుల. ఇంజనీరింగ్ విద్యార్థిని.
మరింత సాహిత్యం కోసం క్లిక్ చేయండి: https://telugu.asianetnews.com/literature