అహోబిలం ప్రభాకర్ తెలుగు కవిత: ఒక నిశ్శబ్దం

By telugu team  |  First Published Apr 10, 2020, 2:58 PM IST

ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి వణికిస్తోంది. ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా వైరస్ మీద తెలుగు కవులు స్పందిస్తున్నారు. అహోబిలం ప్రభాకర్ రాసిన ఈ కవిత చదవండి.


బార్డర్ లో తూటాలు లేవు 
తాటాకు చప్పుల్లు లేవు 
ఇప్పుడంతా నిశ్శబ్దం 
 
గుపిట్లో ప్రపంచంల  
పక్కోని గూడు
కోవిడ్ తో కాళి అవుతుందో
దేశ పటాల  సంఖ్య 
చావు రేటు ముందు 
చిన్నదౌతూందో
గుస గుస లకు తావు లేదు
ఇపుడంతా తండ్లాటే

నిన్నటి వరకు 
రణ గొణ రహదారులన్నీ
కాలుష్యం దిగమింగి
నిద్దుర  పోతున్నట్టు 

Latest Videos

అనుమానం తోటి తాకిన 
కరచాలనం లో  చావు భయం
కండ్ల నిండా చేతిరాతలు 
కడుగుతుంటది
మాస్క్ చాటున 
శ్వాస దిగమింగు కుంట

నీ ప్రాణంతో ఇన్సూరెన్స్ 
పంట పండిచుకున్నవాల్లు
ఇప్పుడు దిక్సూచిలు మాత్రమే 

నీ పక్కింట్లో కరోన దాగుందో
ఏ మిసైల్స్ కనిపెట్టలేవు
ఏ అణుబాంబులు మట్టు బెట్ట లేవు

విత్తలేని వాడు 
రియలెస్టేట్ తో
ఎకరాలుగా విస్తరించి 
జనతా కర్ఫ్యూల
ఇపుడు ప్రాణాలన్ని 
తాబేలు చిప్ప కింద దాచుకున్నడు

పొద్దుతిరుగుడు పువ్వులా 
తిరగాడిన వాడికి
గూట్లో కుక్కివుండటం కష్టకాలమే

ప్రకృతికి మనిషి వికృతి ఐతే
కరోన మనిషికే  శత్రువు
 
ఇపుడు నీ లక్షం
మనిషికి మనిషి నిర్బంధం
నీవు స్తబ్ధుగా వుండటమే వ్యూహం
నీ సహనమే పెద్ద ఆయుధం
నీ ఇల్లే రక్షక కవచం 
నీ గడపలో నీవుండటమే యుద్ధం 

మరింత సాహిత్యం కోసం ఇక్కడ క్లిక్ చేయండి;https://telugu.asianetnews.com/literature

click me!