అన్నవరం దేవేందర్ కవిత: వ్యాక్సిన్

By telugu team  |  First Published Apr 26, 2021, 11:22 AM IST

కరోనా కాలంలో వ్యాక్సిన్ ఓ బ్రహ్మపదార్థంగా మారింది. ఆ వ్యాక్సిన్ మీద అన్నవరం దేవేందర్ రాసిన కవితను చదవండి.


దెబ్బలు లేవు బొబ్బలు లేవు
పెయ్యంత జర కొట్టి పండవెట్టి నట్టు

ఎన్ని నీళ్లు తాగినా ఆరనట్టుగా దూప
నోరంతా ఎండుక పోయిన కంచం

Latest Videos

undefined

మనసంతా బుగులు బుగులు పొగలు
లోపల సూస్తే అంతా కుల్లం కుల్ల

కప్పుకొని పంటే లేవ బుద్ధి అవుడు
లేశి కూసుంటే పండ బుద్ధి అవుడు

కొంచెం కొంచెం జరం కొట్టినట్టు కాక
మాత్ర పడంగనే  సల్ల చెమటలు

సై లేని నాలిక, నోట్లెకు  ఏం సైసది
గావురం గాపురం మాటలకైతే 
ముద్ద మా కడుపుల పడుతది

ఇదంతా కోవ్యాగ్జిన్  వ్యాక్సిన్ కోపాగ్ని 
ఒక్క రోజు దేహం అతలాకుతలం
కోవిడ్ గాడు ఓడి పోయే యుద్ధం మొదలైంది.

click me!