కుటుంబం దేశానికి మినీకేచర్ దేశం కుటుంబపు వికృత కారికేచర్ అంటున్న జ్వలిత కవిత " వికృత కారికేచర్ " ఇక్కడ చదవండి :
ఎవరో వచ్చి నీకు ముసుగేస్తుంటే
మిన్నకున్నావంటే అంగీకరించినట్లే కదా
అవాంఛిత బంధాలను అంగీకరించి
అనాధగా మారడం అంటే
అజ్ఞానపీఠమై ప్రకాశించడమే
అమాయకత్వం అంటే పొగడ్తని పొంగిపోయావు
కాదు అజ్ఞానానికి పర్యాయపదం అని
నే చెప్తూనే ఉన్నాను
విచ్ఛిన్నం కావడానికి
అగ్రాలో ఉగ్రాలో అవసరంలేదు
కూసింత స్వార్థం మరికొంత పలాయనం చాలు
చొరబాటుతనమే ప్రైమ్ పేసియా
కుటుంబం దేశానికి మినీకేచర్
దేశం కుటుంబపు వికృత కారికేచర్