తెలుగు భాషా వికాస పరిషత్ వార్షికోత్సవం సందర్భంగా కథల పోటీ నిర్వహిస్తున్నారు.ఈ పోటీ నిమిత్తం సామాజిక స్పృహ కలిగి ఆధునికత,కొసమెరుపు ఉండే కథలను ఆహ్వానిస్తున్నారు. హృదయాలను ఆకర్షింపజేసే కథలకు ప్రాధాన్యత ఉంటుంది.
ఉత్సాహిత రచయితలు తాము రాసిన కథలను డి.టి.పి లో నాలుగు పేజీలు మించకుండా పంపించాలి. కథా వస్తువు రచయిత ఇష్టం.... కాని తానే స్వయంగా రాసినట్లుగా రచయిత హామీపత్రం ఇవ్వాల్సి వుంటుంది.
నగదు బహుమతులు:
ప్రథమ బహుమతి : 60,000 రూ.లు
ద్వితీయ బహుమతి : 40,000 రూ.లు
తృతీయ బహుమతి : 20,000 రూ.లు
పోటీ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు తావులేదు.
మీ కథలు ఈ క్రింది ఈమెయిల్ కు ఏప్రిల్ 30 సాయంత్రం 6 గంటల లోపు పంపాలి.
ఈ మెయిల్ : mvsmurthypolice@gmail.com