అరిశా సత్యనారాయణ - ఆదిలక్ష్మి సార్మక కథల పోటీకి ఆహ్వానం ...

By Arun Kumar PFirst Published Mar 28, 2023, 4:01 PM IST
Highlights

అరిశా సత్యనారాయణ - ఆదిలక్ష్మి సార్మక కథల పోటీలకు ఆసక్తిగల రచయితలు సరికొత్త కథలతో ముందుకురావాలని పాలపిట్ట పత్రిక సూచించింది. 

ఆధునిక జీవితం సంక్లిష్టమైంది. సంక్షుభితభరితమైంది. అయినప్పటికీ మనుషులుగా మనమంతా ఒకచోట కలిసి బతకడం తప్పనిసరి. కనుక మన చుట్టుపక్కల ఉన్న వారిలో మానవీయ భావనలని పెంపొందించడం,  ఉన్నత సంస్కారాన్ని అలవరచడం సాహిత్యరచనల కర్తవ్యం. దీనిని దృష్టిలో ఉంచుకొని అరిశా సత్యనారాయణ - అరిశా ఆదిలక్ష్మి స్మారక కథల పోటీని నిర్వహించాలని సంకల్పించడమైంది. జీవితకాలమంతా  సానుకూల భావనలతో, మంచి పక్షాన నిలిచిన ఈ ఇద్దరి జ్ఞాపకాల స్ఫూర్తి ఈ కథల పోటీకి ప్రేరణ. పాఠకులలో ఉదాత్త సంస్కారం పాదుకోడానికి తోడ్పడే కథారచనని ప్రోత్సహించాలన్నదే ఈ పోటీ ఉద్దేశం. ఈ పోటీలో పాల్గొనవలసిందిగా కథకులని ఆహ్వానిస్తున్నాం.

బహుమతులు
మొదటి బహుమతిః రూ. 7000
రెండో బహుమతిః రూ. 5000
మూడో బహుమతిః రూ. 3000
అయిదు ప్రత్యేక బహుమతులు
ఒక్కొక్క కథకి రూ. 1000 

నిబంధనలు:
- మనిషి జీవితం అనేక అనుభవాల సమ్మేళనం కనుక ఎలాంటి ఇతివృత్తం ఎంచుకోవాలో కథకుల నిర్ణయానికి వదిలేస్తున్నాం. జీవితం పట్ల మమకారాన్ని ప్రోది చేసే కథావస్తువు ఏదైనా పరవాలేదు.
-  వస్తువుతో పాటు శిల్పం ఈ పోటీలో ప్రముఖంగా పరిగణనలోకి తీసుకునే అంశం. ఇతివృత్తాన్ని ఎంత సుందరంగా, రమణీయంగా, పఠిత మనసుని ఆకట్టుకునేలా సృజించారన్నదే ప్రధానం.  
- ఈ కథల పోటికి ఎలాంటి పేజీల పరిమితి లేదు. తాము చెప్పదలచుకున్న కథని ఎన్ని పేజీలలో చెబుతారనేది కథకుల సృజనాత్మక స్వేచ్ఛకు సంబంధించిన అంశం. కనుకనే పేజీల పరిధులు, పరిమితులేమీ లేవు. 
- పోటీకి పంపించే కథలు సొంత కథలయి ఉండాలి. అనువాదాలు కాదు. అలాగే ఇదివరలో ఎక్కడా ప్రచురితం, ప్రసారితం కాకూడదు. సోషల్‌ మీడియాలోగానీ, ఇతర వెబ్‌సైట్లలో గానీ ప్రచురితమై ఉండరాదు. ఈమేరకు కథతోపాటు హామీపత్రం పంపించాలి.
- కవర్‌ మీద అరిశా సత్యనారాయణ -  అరిశా ఆదిలక్ష్మమ్మ గార్ల స్మారక కథల పోటీకి అని రాయాలి. పోటీ నిమిత్తం పంపించే కథలు తిప్పి పంపడం సాధ్యం కాదు.
- కథల ఎంపిక విషయంలో పాలపిట్ట సంపాదకవర్గానిదే తుది నిర్ణయం. ఈ విషయంలో ఎలాంటి వాదవివాదాలకు, సంప్రదింపులకు తావు లేదు.
- ఈ పోటీలో ఎంపిక చేసే కథలని పాలపిట్టలో ప్రచురించడంతోపాటు భవిష్యత్తులో తీసుకురానున్న కథల సంకలనాలలోనూ ముద్రిస్తాం. 

మీ కథలు చేరడానికి చివరితేదీ - 30 ఏప్రిల్‌ 2023
పోటీ ఫలితాలను ప్రకటించే తేదీ ` 25 మే 2023
మీ కథలని పోస్టు చేయవచ్చు లేదా మెయిల్‌లోనూ పంపవచ్చు.

చిరునామాః ఎడిటర్‌, పాలపిట్ట
ఎఫ్‌-2, బ్లాక్‌ -6, ఏపిహెచ్‌బి
బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌-500044
ఫోనుః 9490099327
email: palapittamag@gmail.com
 

click me!