అరసం వచన కవితా పోటీలు... యువ రచయితలకు ఆహ్వానం

Published : Mar 28, 2023, 12:58 PM IST
అరసం వచన కవితా పోటీలు... యువ రచయితలకు ఆహ్వానం

సారాంశం

యువ రచయితలను ప్రోత్సహించేలా ఏపీ అభ్యుదయ రచయితల సంఘం, విశాలాంధ్ర దినపత్రికి సంయుక్తంగా  వచన కవితా పోటీలను నిర్వహిస్తోంది. 

ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, విశాలాంధ్ర దినపత్రిక సంయుక్తంగా యువ కవులకు "వచన కవితా పోటీలు" నిర్వహిస్తున్నామని అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. 
వర్తమాన రాజకీయ సామజిక అంశాలపై 30పంక్తులకు మించని కవితలు, ఒకరు ఒకటి మాత్రమే ఏప్రిల్ 27వ తేదీలోగా పంపాలని, కవుల వయసు 30 సంవత్సరాలు మించరాదని, దళితులను, మైనార్టీలను, స్త్రీలను కించపరిచే కవితలు పంపరాదని ఆయన తెలిపారు.
ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా రూ. 1500, 1000, 750 లను, ఎంపికైన కవితలను విశాలాంధ్ర దినపత్రికలో ప్రచురిస్తాని, శివప్రసాద్ తెలిపారు. కవితలను ఎక్కడా ప్రచురితం కాని స్వీయ రచన అనే హామీ పత్రంతో దిగువ చిరునామాకు పంపాలి.
ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం
#401 శ్రావణి రెసిడెన్సీ
6/3, ఎస్ వి ఎన్ కాలనీ
గుంటూరు 522006
చరవాణి: 9291530714

అభివందనలతో,
వల్లూరు శివప్రసాద్
ప్రధాన కార్యదర్శి

PREV
click me!

Recommended Stories

Tim Cook books టిమ్ కుక్ ని మార్చేసిన పుస్తకాలు.. చదివితే మనకూ స్ఫూర్తి పాఠాలు
అపరాజిత అయోధ్య : రామాలయ చరిత్ర, శతాబ్దాల పోరాటం