తెలంగాణ మహిళా కథల పోటీకి ఆహ్వానం

By Arun Kumar PFirst Published Jul 17, 2023, 2:19 PM IST
Highlights

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా బహుళ అంతర్జాల అంతర్జాతీయ త్రైమాసిక స్త్రీవాద పత్రిక, కెనడా తెలుగు తల్లి మాసపత్రిక, హెచ్.ఆర్.సి.లిటరరీ ఫౌండేషన్ సంయుక్తంగా  కథల పోటీ నిర్వహిస్తోంది. ఆసక్తి గల రచయితలు మహిళా లోకానికి సంబంధించిన కథలను పంపించాల్సిందిగా నిర్వహకులు ఆహ్వానిస్తున్నారు. 

అంశం: తెలంగాణ చరిత్ర, సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించాలి.
చివరి తేదీ: 30 ఆగస్టు  2023.
పోటీ ఫలితాలు వెల్లడి: 15 అక్టోబర్ 2023.

నిబంధనలు:

1. కథలను యునికోడ్ లో కానీ వర్డ్ ఫైల్ కానీ పంపాలి.
2. ఏ ఫోర్ సైజ్ పేపర్లో 7 పేజీలు మించకుండా కథ ఉండాలి(2200 పదాలకు మించకుండా, అక్షర దోషాలు లేకుండా జాగ్రత్తగా చూసుకొని కథలు పోటీకి పంపండి )
3. ఒక్కొక్కరు ఒక్క కథ మాత్రమే మహిళలు మాత్రమే పంపాలి.
4. కథ పై పేరు రాయకూడదు. 
5. హామీపత్రంలో కలంపేరు, అసలు పేరు
 మీ స్వంత రచన అని, ఈ పోటీ కొరకు రాసిన కథ అని రాయాలి. చిరునామా వ్యక్తిగత వివరాలతో పాటు మీ ఫోన్ నెంబర్, పాస్పోర్ట్ సైజ్ ఫొటో జోడించాలి.
6. పోటీకి పంపిన కథలతో సంకలనం వెలువడుతుంది. అంత వరకు వేరే పత్రికలకు పంపకూడదు.

పోటీలో విజేతలకు బహుమతులు
1.ప్రథమ బహుమతి 5000 
2.ద్వితీయ బహుమతి 4000/-  
3.తృతీయ బహుమతి 3000/- 
4.ఐదు ప్రత్యేక బహుమతులు ఒక్కొక్కరికి 1000/-

 కథలు పంపవలసిన చిరునామా
telanganamahilakathalu@gmail.com
వివరాలకు: 7995820736.

click me!