ప్రముఖ కవి అందెశ్రీకి.. సుద్దాల హనుమంతు-జానకమ్మ జాతీయ పురస్కారం..

Published : Oct 12, 2022, 10:10 AM ISTUpdated : Oct 12, 2022, 09:50 PM IST
ప్రముఖ కవి అందెశ్రీకి.. సుద్దాల హనుమంతు-జానకమ్మ జాతీయ పురస్కారం..

సారాంశం

సుద్దాల హనుమంతు జాతీయ పురస్కారానికి ప్రముఖ కవి అందెశ్రీ ఎంపికయ్యారు. ఈ నెల 15న ఈ అవార్డు ఆయనకు అందించనున్నారు.

హైదరాబాద్ :  సుప్రసిద్ధ కవి అందెశ్రీ.. సుద్దాల హనుమంతు-జానకమ్మ జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ విషయాన్ని సుద్దాల ఫౌండేషన్ సంస్థ వ్యవస్థాపకుడు ప్రముఖ సినీ గేయరచయిత సుద్దాల అశోక్ తేజ వెల్లడించారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఏటా ప్రముఖ సాహితీవేత్తలు, కవులు, రచయితలకు పురస్కారాన్ని అందజేస్తూ వస్తున్నారు. ఈ నెల 15న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జాతీయ పురస్కార ప్రదానం జరుగుతుందని అశోక్ తేజ వెల్లడించారు. మంగళ మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడారు. పురస్కారప్రధాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి,  ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు డాక్టర్ బి రవీందర్ తదితరులు హాజరవుతారని వెల్లడించారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Tim Cook books టిమ్ కుక్ ని మార్చేసిన పుస్తకాలు.. చదివితే మనకూ స్ఫూర్తి పాఠాలు
అపరాజిత అయోధ్య : రామాలయ చరిత్ర, శతాబ్దాల పోరాటం