సృజనప్రియ మాసపత్రిక కవితల పోటీ ఫలితాలు

By Arun Kumar P  |  First Published May 2, 2022, 3:36 PM IST

సృజనప్రియ మాస పత్రిక రజతోత్సవ సందర్భంగా నిర్వహించిన కవితల పోటీ ఫలితాలను వెల్లడించారు. 


గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ప్రచురింపబడుతూ బహుళ పాఠకాదరణ పొందుతున్న సృజనప్రియ మాస పత్రిక రజతోత్సవ సందర్భంగా నిర్వహించిన కవితల పోటీకి శతాధికంగా కవితలు పంపి పోటీని ఫలప్రదం చేసిన కవులకు, కవయిత్రులకు ధన్యవాదాలు. మాకు అందిన కవితలను మా ఎడిటోరియల్ బోర్డ్ సభ్యులు అనేక వడపోతల తరువాత న్యాయ నిర్ణేతలకు పంపడమైనది. మా అభ్యర్ధనను మన్నించి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన ఆచార్య దార్ల వెంకటేశ్వర రావు గారు, డాక్టర్ కోయి కోటేశ్వరరావు గారు, ఎం. నారాయణ శర్మగారలు ఇచ్చిన ఫలితాలను ఎడిటోరియల్  బోర్డ్ యధాతధంగా ఆమోదించింది.  వారి నిర్ణయం మేరకు ఈ క్రింద తెలియజేసిన కవితలకు బహుమతులు ప్రకటించడమైనది.

మొదటి బహుమతి: రూ.3000/- 'చీకటి ముఖం'-శ్రీ సాంబమూర్తి లండ, ఒంకులూరు

Latest Videos

రెండవ బహుమతి: రూ.2000/- 'వలస దుఃఖం'- శ్రీ కలమట దాసుబాబు, శ్రీకాకుళం

మూడవ బహుమతి: రూ.1000/- 'ఉల్లిపువ్వు-ఊరునవ్వు' -శ్రీ వేముగంటి మురళి,హైదరాబాద్.

ప్రత్యేక బహుమతులు: (5) ఒక్కొక్కటి రూ.500/- :
'నువ్వు లేవు'-శ్రీ చొక్కాపు లక్ష్ము నాయుడు,విజయనగరం,
'యుద్ధం ఇంకా ఒడువలేదు'- శ్రీ రవీంద్రసూరి నామాల, హైదరాబాద్,
'శేష వస్త్రం'- శ్రీ దేశరాజు, హైదరాబాద్,
'జన్మించడమే కవిత్వం'- శ్రీమతి శైలజామిత్ర, హైదరాబాద్,
'రంగుల కంబళి'- Dr.డి వి జి శంకర రావు,విజయనగరం.

సాధారణ ప్రచురణకు స్వీకరించిన కవితలు
'నా బట్టమేక బతికి బట్టకట్టాల్సిందే'- టి. హెచ్. నటరాజారావు,
'అన్నీ తెలిసినట్టే ఉంటాయి:- చొక్కర తాతా రావు,
'తుషార యవనిక'- టి.హెచ్.నటరాజారావు,
'దేవుడా'..మల్లాప్రగడ రామారావు,
'చేతులు కావాలి'- పల్లిపట్టు నాగరాజు
'చివరి పేజీ'-డా.మల్లిపూడి రవిచంద్ర
'ఓ కొత్తదేవుడి కథ'- శ్రీనివాస వాసుదేవ్
'వేదికొకటి కావాలి'- ఆవాల శారద
'సమయమిదే:- శ్రీమతి కళా గోపాల్
'అడవి కాలిపోయింది'- యాములపల్లి నరసిరెడ్డి,
'మారణహోమం'- శాంతి,
'ప్రయివేటు టీచర్'- రాజేశ్వర రావు లేదాళ్ల,
'ధన్యమైన తనువులు'- వైరాగ్యం ప్రభాకర్,
'రేపటికోసం'- వడ్డాది రవికాంత్ శర్మ,
'పేగుబంధం'- ఆయాచితం ప్రమీల,
'వలస జీవులం'- స్వాతి శ్రీపాద,
'తుది మెరుగులు'- పి.చంద్ర శేఖర ఆజాద్
'తలలొంచరు' - అవ్వారు శ్రీధర్ బాబు
'ఘోష'- సి.ఎస్. రాంబాబు

త్వరలో హైదరాబాద్ లో జరగబోయే రజతోత్సవ వేడుకలలో బహుమతులు గెలుచుకున్న కవులకు/కవయిత్రులకు నగదు బహుమతితో పాటు ప్రముఖుల సమక్షంలో కవి సత్కారం ఉంటుంది. వేడుకల తేదీ,సమయం,వేదిక మొదలైన వివరాలు కవులకు వ్యక్తిగతంగా సమాచారం ఇవ్వబడును. ఎంతో విలువైన సమయాన్ని కేటాయించి కవితలను అనేక పర్యాయాలు చదివి తమ నిర్ణయం తెలియజేసిన న్యాయ నిర్ణేతలకు, తమ కవితలను పంపి కవిత్వ పోటీలను జయప్రదం చేసిన కవులకు కృతజ్ఞతలు. శుభాకాంక్షలు

ఎంతో శ్రమకోర్చి ఈ పోటీలను తన స్వంత బాధ్యతగా స్వీకరించి చాలా సమర్ధవంతంగా నిర్వహించి మా సంస్థకు మంచి పేరు తెస్తున్న సృజననేడు దినపత్రిక సాహిత్య పేజీ నిర్వాహకులు శ్రీ విల్సన్ రావు కొమ్మవరపు గారికి ధన్యవాదాలు.

నీలం దయానందరాజు
సంపాదకులు,
సృజనప్రియ మాస పత్రిక,
సృజననేడు దినపత్రిక
హైదరాబాద్- 500 060
ఫోన్: 93467 90689/ 84990 01654
 

click me!