ఇటీవల సృజనప్రియ మాసపత్రిక నిర్వహించిన కథల ఫోటీ ఫలితాలను సంపాదకులు నీలం దయానందరాజు ప్రకటించారు.
గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ప్రచురింపబడుతూ బహుళ పాఠకాదరణ పొందుతున్న సృజనప్రియ మాస పత్రిక రజతోత్సవ సందర్భంగా ఇటీవల నిర్వహించిన కథల పోటీ ఫలితాలను సంపాదకులు నీలం దయానందరాజు ప్రకటించారు. పోటీకి శతాధికంగా కథలు పంపి పోటీని ఫలప్రదం చేసిన కథకులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కథల పోటీ కి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన ఆచార్య కొలకలూరి ఆశాజ్యోతి , కె.పి.అశోక్ కుమార్ , వంశీకృష్ణ గారలు ఇచ్చిన ఫలితాలను ఎడిటోరియల్ బోర్డ్ యధాతధంగా ఆమోదించి వారి నిర్ణయం మేరకు ఈ క్రింద తెలియజేసిన కథలకు బహుమతులు ప్రకటించారు.
మొదటి బహుమతి: రూ.5000/- 'ఎపోకలిప్టిక్666'-డా.ఎమ్.సుగుణారావు, విశాఖపట్నం.
రెండవ బహుమతి: రూ.3000/-'కార్పొరేట్ వైద్యం'- శ్రీ రత్నాకర్ పెనుమాక, యానాం.
మూడవ బహుమతి: రూ.2000/- 'అమ్మకోసం' -శ్రీమతి తటవర్తి నాగేశ్వరి,కొవ్వూరు
ప్రత్యేక బహుమతులు: (7) ఒక్కొక్కటి రూ.1000/- :
'వైరస్'- శ్రీ శరత్ చంద్ర,హైదరాబాద్
'తల్లీ నిన్ను దలంచి'- శ్రీమతి అరుణ చామర్తి హనుమకొండ
'వెలకట్టలేనిది'-శ్రీ జి.ఎస్.కె.సాయిబాబు, అనకాపల్లి
'గ్రీష్మ వాసంతం'-శ్రీ బాడిశ హన్మంతరావు, కోదాడ,
'నీరెండ నీడ'- శ్రీ వడలి రాధాకృష్ణ,చీరాల
'తాబేళ్లు'- శ్రీ దేశరాజు, హైదరాబాద్,
'వాస్తవ చిత్రం'- శ్రీ కట్టా రాంబాబు, రాజమండ్రి.
సాధారణ ప్రచురణకు స్వీకరించిన కథలు:
1.'జీవన వైరుధ్యం'-డా.కె.పద్మలత
2.'ఆల్బమ్'- తిరుమలశ్రీ
3.'నిష్కృతి'-శ్రీ అవ్వారు శ్రీధర్ బాబు
4.'రెండు కుటుంబాలు'-శ్రీమతి కోటమర్తి రాధా హిమబిందు
5.'ధర్మ నిలయం'-శ్రీమతి ఉప్పులూరి మధుపత్ర శైలజ
6.'న్యూజెన్'- శ్రీ పి.చంద్రశేఖర ఆజాద్,
7.'పోనీ… మనకెందుకులే'- శ్రీ పి.వి.శేషారత్నం,
8.'కొత్త గాలి'-శ్రీ సి.ఎస్. రాంబాబు
9.'ఆశ'-శ్రీ బట్టిపాటి జైదాస్
10.'చిత్తక్క కత!?' - శ్రీ అడవాల శేషగిరి రాయుడు
11.'రెప్పవాల్చని చూపు'-డా.జడా సుబ్బారావు
12 'మునిరత్నం'- శ్రీ బి.వి.శివ ప్రసాద్
13.'దివ్యాoగులు'- శ్రీ గుండాన జోగారావు
14.'అగ్నిపుత్రి'- శ్రీమతి బి.కళా గోపాల్
15.'మరోబాటసారి'- శ్రీ కృపాకర్ పోతుల
16.'తల్లికోడి'-శ్రీ సింహప్రసాద్
17.'జాతస్య మరణం ధృవం'-శ్రీమతి వాడపల్లి పూర్ణ కామేశ్వరి
18.'బడేహుయేతో క్యా హుఆ'-శ్రీ నల్ల భూమయ్య
19.'తల్లిగడ్డ ఋణం'-శ్రీ అంబల్ల జనార్దన్
20.'కొత్త జీవితం'-శ్రీ ఓట్ర ప్రకాష్ రావు, తిరుత్తణి
21.'ఇలా ముగిసింది'-శ్రీ బి.నర్సన్
22.'డేట్ ఆఫ్ బర్త్' - శ్రీ చిరువోలు మెహెర్ భాస్కర్
23.'లక్ష్యం'-శ్రీ చొక్కర తాతారావు
24.'నడిపించే నీడ'- శ్రీమతి పద్మావతి రాంభక్త
25.'చూపున్న పల్లవి'- శ్రీమతి వంజారి రోహిణి
26.'ఔను…నన్నుచూసి ఎందుకెళ్లి పోయారు'- శ్రీ పొత్తూరి సీతారామ రాజు
27.'ట్రీట్మెంట్' - శ్రీ సడ్లపల్లి చిదంబర రెడ్డి
త్వరలో హైదరాబాద్ లో జరగబోయే రజతోత్సవ వేడుకలలో బహుమతులు గెలుచుకున్న రచయితలకు నగదు బహుమతితో పాటు ప్రముఖుల సమక్షంలో సత్కారం ఉంటుందని, వేడుకల తేదీ,సమయం,వేదిక మొదలైన వివరాలు రచయితలకు వ్యక్తిగతంగా సమాచారం ఇవ్వబడుతుందని నీలం దయానందరాజు ఒక ప్రకటనలో తెలియజేశారు.