అయోధ్యారెడ్డి "అక్కన్నపేట రైల్వేస్టేషన్" కథా సంపుటికి మాడభూషి అవార్డు

Arun Kumar P   | Asianet News
Published : May 06, 2022, 12:41 PM IST
అయోధ్యారెడ్డి "అక్కన్నపేట రైల్వేస్టేషన్" కథా సంపుటికి మాడభూషి అవార్డు

సారాంశం

ప్రముఖ రచయిన అయోధ్యారెడ్డి రచించిన 'అక్కన్నపేట రైల్వేస్టేషన్' కథా సంపుటి ప్రతిష్టాత్మక మాడభూషి రంగాచార్య స్మారక అవార్డుకు ఎంపికయ్యింది. 

హైదరాబాద్: మాడభూషి రంగాచార్య స్మారక అవార్డు 2021సంవత్సరానికి గాను ప్రముఖ కథారచయిత, అనువాదకులు ఎ.యం.అయోధ్యారెడ్డి కథా సంపుటి 'అక్కన్నపేట రైల్వేస్టేషన్'ను పురస్కారానికి ఎంపిక చేస్తూ మాడభూషి రంగాచార్య స్మారక అవార్డు కమిటీ నిర్ణయించింది. 

కమిటీ నిర్వాహక సభ్యుల సమావేశం ప్రముఖ కవి, కథా నవలా రచయిత, చిత్రకారులు శీలా వీర్రాజు సారథ్యంలో మంగళవారం జరిగింది. ప్రతి ఏటా ఒక ఉత్తమ కథా సంపుటికి పదివేల రూపాయలు బహుమతి ఇచ్చే ఒరవడిలో 2021సంవత్సరానికి 'అక్కన్నపేట రైల్వేస్టేషన్' సంపుటిని పురస్కారానికి ఎంపిక చేశారు. డా.డి.చంద్రశేఖరరెడ్డి (ఎమెస్కోసంపాదకులు ), సుధామ, డా.నాళేశ్వరం శంకరం, శ్రీమతి మాడభూషి లలితాదేవి (కన్వీనర్) ఈ ఏడాది జూన్ తరువాత పురస్కార ప్రదానోత్సవ సభ జరపాలని భావిస్తున్నట్లు ప్రకటించారు.

PREV
click me!

Recommended Stories

Tim Cook books టిమ్ కుక్ ని మార్చేసిన పుస్తకాలు.. చదివితే మనకూ స్ఫూర్తి పాఠాలు
అపరాజిత అయోధ్య : రామాలయ చరిత్ర, శతాబ్దాల పోరాటం