సోమనాథ కళా పీఠం: అవార్డులు వీరికే

By narsimha lodeFirst Published Dec 24, 2023, 12:24 PM IST
Highlights

సోమనాథ కళా పీఠం పురస్కార గ్రహీతల వివరాలు ఇక్కడ చదవండి : 

మహాకవి పాల్కురికి సోమనాథుని జన్మస్థలమైన జనగామ జిల్లా పాలకుర్తిలోని "సోమనాథ కళా పీఠం" సాహిత్య సాంస్కృతిక వేదిక 2021-22 ద్వైవార్షిక పురస్కార గ్రహీతల ఎంపిక ప్రక్రియ పూర్తి అయింది అని పీఠం అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ రాపోలు సత్యనారాయణ,  ఇమ్మడి దామోదర్ ఒక ప్రకటనలో తెలిపారు. "సోమనాథ సాహిత్య పురస్కారం" డాక్టర్ కానుకుర్తి శెట్టి సోమశేఖర్ (మహబూబ్ నగర్)కు, "సోమనాథ సామాజిక శోధన పురస్కారం" డాక్టర్ నలిమెల భాస్కర్ (కరీంనగర్)కు, "సోమనాథ రంగస్థల పురస్కారం"  మంచాల రమేశ్ (కరీంనగర్)కు,  "పందిళ్ల శేఖర్ బాబు రాజయ్య శాస్త్రి స్వచ్ఛంద భాషా సేవ పురస్కారం" డాక్టర్ మైథిలి అబ్బరాజు (బెంగళూరు)కు,  "వీరమనేని చలపతిరావు సాహిత్య పురస్కారం" ఎం ఎస్ ఆర్ వెంకటరమణ (వెంకూ) (సామర్లకోట)కు,  "ముశం దామోదర్ రావు ప్రాచీన చరిత్ర వైజ్ఞానిక పరిశోధన పురస్కారం" డాక్టర్ సి ఎస్ ఆర్ ప్రభు (హైదరాబాద్)కు,   "డాక్టర్ రాపోలు సోమయ్య ప్రతిభా పురస్కారం" డాక్టర్ అరూరి మహేందర్ (విస్నూరు)కు,  "దేవగిరి రాజయ్య స్మారక బిరుదు" బూస రేణుకారాధ్య (విశాఖపట్నం)కు ప్రదానం చేస్తున్నారు.

రాపోలు ఆనంద భాస్కర్, డాక్టర్ లింగంపల్లి రామచంద్ర, డాక్టర్ టి శ్రీరంగస్వామి,  డాక్టర్ మార్గం లక్ష్మినారాయణ (సమన్వయకర్త) లతో కూడిన నిర్ణాయక మండలి ఈ ఎంపిక చేసింది. పురస్కార ప్రదాన సభ 2023 డిసెంబర్ 31 ఆదివారం నాడు పాలకుర్తిలో జరిగుతుందని సంస్థ కార్యదర్శి ఇమ్మడి దామోదర్ ఒక ప్రకటనలో తెలిపారు.
 

click me!