సంగీత సాహిత్య నృత్య కళానిధి పురస్కారాల ప్రదానోత్సవం

By Arun Kumar P  |  First Published Oct 2, 2023, 2:43 PM IST

నిన్న (ఆదివారం)  హన్మకొండ నక్కలగుట్టలోని వరంగల్ దర్శన్ స్టూడియోలో ఆల్ బ్రాహ్మిన్స్ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ (అబోపా) ఆధ్వర్యంలో నిర్వహించిన 'సంగీత సాహిత్య నృత్య కళానిధి' పురస్కారల ప్రదానోత్సవ సభ  అబోపా అధ్యక్షులు మోతుకూరి మనోహర్ రావు అధ్యక్షతన  ఘనంగా జరిగింది.  ఆ వివరాలు ఇక్కడ చదవండి : 


సంగీతం నాట్యం నృత్యంతో మానసిక ఉల్లాసం, వికాసం కలుగుతాయని ప్రముఖ సాహితీవేత్త విమర్శకులు, సాహితీ విరించి గన్నమరాజు గిరిజా మనోహర్ బాబు అన్నారు. ఆదివారం హనుమకొండ నక్కలగుట్టలోని   వరంగల్ దర్శన్ స్టూడియోలో ఆల్ బ్రాహ్మిన్స్ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ (అబోపా) ఆధ్వర్యంలో నిర్వహించిన 'సంగీత సాహిత్య నృత్య కళానిధి' పురస్కారల ప్రదానోత్సవ సభ  అబోపా అధ్యక్షులు మోతుకూరి మనోహర్ రావు అధ్యక్షతన    ఘనంగా జరిగింది.  

ఈ సందర్భంగా గన్నమరాజు గిరిజా మనోహర్ బాబు మాట్లాడుతూ సంగీతం నాట్యం నృత్యంతో మానసిక ఉల్లాసం మరియు బుద్ధి వికాసం కలుగుతుందని అన్నారు.  భారతీయ కళలు వేదజ్ఞానంతో సమానమని జిజ్ఞాస ఉంటే ఏ కళలో నైనా అభ్యాసంతో ప్రతిభ సాధ్యం అవుతుందని, మనకు   ఏ రంగంలో  అభిరుచి ఉంటుందో దానిపై శ్రద్ధ వహిస్తే అది సాధ్యం అవుతుందని  ఆయన అన్నారు. ముఖ్య అతిథి దహగం సాంబమూర్తి  మాట్లాడుతూ సంగీతం, సాహిత్యం,నృత్యం భారతీయ సనాతన ధర్మానికి ప్రతీకలని  ఈ మూడింటిని ఒకే వేదిక మీదకు చేర్చి కళాకారులను సత్కరించుకోవడం గొప్ప అనుభూతినిస్తుంది అని అన్నారు. అబోపా అధ్యక్షులు మనోహర్ రావు మాట్లాడుతూ  మూడు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని గతంలో సాహిత్యంలో పొట్లపల్లి శ్రీనివాసరావు, మోత్కూరి మాణిక్యరావు, సంగీతంలో వద్దిరాజు నివేదిత, పాలకుర్తి సుమనకు, నృత్యంలో ఇందారపు సుస్మిత, తాడూరి రేణుక లకు కళానిధి పురస్కారాలను అందజేసామని ఆయన అన్నారు. 

Latest Videos

ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి పొట్లపల్లి శ్రీనివాసరావు, వరిగొండ కాంతారావు, కుందావజ్జల కృష్ణమూర్తి, ప్రముఖ రంగస్థల నటుడు దేవరాజు రవీందర్ రావు, అబోపా సలహా దారు వద్దిరాజు వెంకటేశ్వరరావు, వ్యాపారవేత్త వద్దిరాజు గణేష్, మండవ నరసింహారావు, పెండెం రమేష్ బాబు, పాలకుర్తి దినకర్, మూల శ్రీనివాస్, వేముగంటి రవీందర్ రావు, ముసిపట్ల శ్రీనివాసరావు, మండువ రవీందర్ రావు, దేవులపల్లి సుదర్శన్ రావు, పెండెం రాఘవరావు, మోతుకూరి ఇందిరాదేవి, వేదాంతం శ్రీదేవి, మండవ పద్మజ, పెండెం శ్రీదేవి  ప్రభృతులు పాల్గొన్నారు.

click me!