తెలుగులో ప్రసిద్ధ కవి జింబో మంగారి రాజేందర్ విశిష్టమైన కవిత్వం అందించారు. ఆయన రాసిన గాయం కవితను ఇక్కడ చదవండి.
గాయాలు చేస్తూ
అమ్మా బాపు వెళ్లిపోయారు
అకాలంగా
అక్కలు అన్నలు వెళ్లిపోయారు
కాలం వాళ్ళని కర్కశంగా కాటేసింది
ప్రతి మరణం ఓ గాయమే !
ఓ ఫోటోనో,ఓ వస్తువో
ఓ ఆటో,ఓ పాటో
ఓ ఉత్తరమో-
వాళ్ళని గుర్తు చేస్తూనే ఉంటాయి
అవి కనిపించని సమయం లేదు
ఓ కవి అన్నట్టు
కాలం గాయాలను మాన్పుతుందేమో
జ్ఞాపకాలని కాదు కదా !!