డా. టి . రాధాకృష్ణమాచార్యులు రాసిన కొన్ని హైకూలు ఇక్కడ చదవండి.
అదేం వ్యక్తిత్వం
మాటలు మార్చే తత్వం
పని గెల్పుకై
అస్ధిత్వ పాట
నీ ఒక్కరి కోసమా
మరి సమాజం?
మనసు దూప
మనిషి బాధ మాప
కలిసి పదా
అర్థం మాటైన
అద్దంలో కన్పించుగా
మనసు తీరు
మిత్రులే తోడు
లోపలి మనసుతో
కష్టాల ఒడి
మనిషే మరి
ఎందుకో మారే ఇలా
అబద్ద బాట
వనంలో మనం
దారంతా ఆకుపచ్చ
మనసూ చెట్లే
అహం కమ్మేసే
స్నేహ సుమ సౌందర్యం
దేహం కాలింది
రుచి మారింది
మనసు మాటా తేడా
ప్రాణం చితికే
ఆకాశం పిలుపు
వాన మట్టి వాసన
గొప్ప వంతెనే.