జాతీయ అవార్డు గ్రహీతకు సన్మానం

By Siva KodatiFirst Published Aug 25, 2023, 7:09 PM IST
Highlights

జాతీయ ఉత్తమ సినిమా విమర్శకుడి పురస్కారం పొందిన  ప్రముఖ సాహితీవేత్త సంగీత విద్వాంసులు డాక్టర్ ఎం పురుషోత్తమాచార్యను సృజన సాహితీ సంస్థ, పిల్లలమర్రి పినవీరభద్ర కళాపీఠం, ఉనికి సామాజిక సాంస్కృతిక వేదిక పక్షాన ఘనంగా సన్మానించారు. 

ప్రతిష్టాత్మకమైన జాతీయ ఉత్తమ సినిమా విమర్శకుడి పురస్కారం పొందిన  ప్రముఖ సాహితీవేత్త సంగీత విద్వాంసులు డాక్టర్ ఎం పురుషోత్తమాచార్యను సృజన సాహితీ సంస్థ, పిల్లలమర్రి పినవీరభద్ర కళాపీఠం, ఉనికి సామాజిక సాంస్కృతిక వేదిక పక్షాన ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సృజన సాహితీ సంస్థ అధ్యక్షులు పెరుమాళ్ళ ఆనంద్ మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో అనేక ప్రక్రియలలో పురుషోత్తమాచార్యులు చేసిన కృషి అభినందనీయమన్నారు.  

కవిగా, రచయితగా, నాటక కర్తగా, బాలసాహితీవేత్తగా, పరిశోధకుడిగా మరియు విమర్శకుడిగా పురుషోత్తమాచార్యులు బహుముఖీనమైన కృషి చేశారని కొనియాడారు. నాగార్జున ప్రభుత్వ కళాశాల తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య మాట్లాడుతూ ఇంతటి ప్రతిష్టాత్మకమైన పురస్కారం నల్లగొండ వాసి అయిన పురుషోత్తమాచార్యులకు రావడం నల్లగొండకే కాక యావత్తు తెలుగు జాతికి గర్వకారణం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పిల్లలమర్రి  పిన వీరభద్ర కళాపీఠం అధ్యక్షులు శీల అవిలేను, ఉనికి సామాజిక సాంస్కృతిక వేదిక అధ్యక్షులు బండారు శంకర్, ధర్మ కేతనం సాహిత్య కళాపీఠం అధ్యక్షులు రఘువీర్ ప్రతాప్ రచయితలు సాగర్ల సత్తయ్య , డాక్టర్ ఉప్పల పద్మ, మాదగాని శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.

click me!