జాతీయోద్యమంలో తెలుగు సాహిత్యం పాత్ర

By Siva KodatiFirst Published Aug 25, 2023, 7:03 PM IST
Highlights

జాతీయోద్యమంలో తెలుగు సాహిత్యం పాత్ర - రెండు రోజులు జాతీయ సదస్సు , ఆగష్టు 29-30 తేదీలలో రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాల్ లో  జరుగుతుంది.     

జాతీయోద్యమంలో తెలుగు సాహిత్యం పాత్ర - రెండు రోజులు జాతీయ సదస్సు , ఆగష్టు 29-30 తేదీలలో రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాల్ లో  జరుగుతుంది. సాహిత్య అకాడెమీ, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో వాడ్రేవు చిన వీరభద్రుడు కీలకోపన్యాసం, కె.జితేంద్ర బాబు సమాపనోపన్యాసం ఇస్తారు. ఆచార్య ఎస్వీ సత్యనారాయణ, డా.సంగిశెట్టి శ్రీనివాస్, ఆచార్య దార్ల వేంకటేశ్వర రావు, డా.కోయి కోటేశ్వర రావు, డా.సీతారాం, డా.కోట్ల హనుమంతరావు, కె.పి.అశోక్ కుమార్, డా.నాగసూరి వేణుగోపాల్, దోరవేటి, సుధామ, అవుసుల భాను ప్రకాశ్,  డా.ఎలిజబెత్ జయ కుమారి, డా.వై.సుభాషిణి, డా.వి.త్రివేణి, డా.ఘనపురం సుదర్శన్ పత్ర సమర్పణ చేస్తారు. జూలూరు గౌరీ శంకర్, డా.అమ్మంగి వేణుగోపాల్ అతిథులుగా పాల్గొంటారు. డా.పి.వారిజా రాణి, డా.ఎస్.రఘు ఆయా సాంకేతిక సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు. 

కన్వీనర్
ఆచార్య సి.మృణాళిని 

డా.మామిడి హరికృష్ణ
సంచాలకులు, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ

click me!