కృష్ణారావుకు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పురస్కారం... పాలమూరు సాహితి హర్షం

Arun Kumar P   | Asianet News
Published : Jun 21, 2022, 02:58 PM IST
కృష్ణారావుకు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పురస్కారం... పాలమూరు సాహితి హర్షం

సారాంశం

ప్రముఖ జర్నలిస్ట్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఎ.కృష్ణారావుకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం లభించింది. 

పాలమూరు జిల్లాకు చెందిన ప్రసిద్ధ కవి, రచయిత, జర్నలిస్ట్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఎ.కృష్ణారావుకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం లభించిన విషయం తెలిసిందే. తమ జిల్లావాసిని ఈ అవార్డు వరించడం పట్ల పాలమూరు సాహితి అధ్యక్షులు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ గుంటి గోపి ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. 

ఎ.కృష్ణారావు రచించిన వచన కవితాసంపుటి "ఆకాశం కోల్పోయిన పక్షి" కు పురస్కారం లభించడం పాలమూరు జిల్లాకు గర్వకారణమన్నారు. ప్రస్తుతం ఎ.కృష్ణారావు ఆంధ్రజ్యోతి దినపత్రిక న్యూఢిల్లీ బ్యూరోగా పనిచేస్తున్నారు. కృష్ణారావు ఇంతకుముందు ఇంకెవరు, ఉన్నట్లుండి, కృష్ణపక్షం వంటి కవితాసంపుటాలు వెలువరించారు.

PREV
click me!

Recommended Stories

Tim Cook books టిమ్ కుక్ ని మార్చేసిన పుస్తకాలు.. చదివితే మనకూ స్ఫూర్తి పాఠాలు
అపరాజిత అయోధ్య : రామాలయ చరిత్ర, శతాబ్దాల పోరాటం