కవిత్వం సాంస్కృతిక ఉనికిని నిలబెట్టుకోవాలి

By Sairam Indur  |  First Published Mar 17, 2024, 7:55 PM IST

వర్తన సాహితీ సంస్థ ఆధ్వర్యంలో   ' నెల నెలా ప్రత్యేక ప్రసంగం' కార్యక్రమంలో  భాగంగా ఈ రోజు 17.03.2024 న   కవి సిద్దార్థ  "కవిత్వ వాస్తవికత" అంశం పైన ప్రసంగించారు. పూర్తి వివరాలకు ఇక్కడ చదవండి.


వర్తన సాహితీ సంస్థ ఆధ్వర్యంలో   ' నెల నెలా ప్రత్యేక ప్రసంగం' కార్యక్రమంలో  భాగంగా ఈ రోజు 17.03.2024 న   కవి సిద్దార్థ  "కవిత్వ వాస్తవికత" అంశం పైన ప్రసంగించారు.  ఈ సమావేశానికి ప్రముఖ కవి, విమర్శకులు, అనువాదకులు డా. రూప్ కుమార్ డబ్బీకార్ అధ్యక్షత వహించారు. ఇది వర్తన రెండవ సమావేశం. సిద్ధార్థ  ప్రసంగంలో భాగంగా చెప్పిన విషయాలు కొన్ని క్లుప్తంగా: 

వర్తమాన దశలో కవిత్వం సాంస్కృతిక ఉనికిని నిలబెట్టుకునే ప్రయత్నం జేస్తుంది.  ఆ దిశలో అనేక రాజకీయ, సామాజిక సంఘర్షణలు, పరిస్థితులు కవిత్వంలో వ్యక్తమవుతున్నాయి.  కవి, కవి ప్రపంచం ఈస్తటిక్స్ తో కూడుకున్నది.  అందుకే కవి తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలి అంటే ముందుగా తన భాషను శుద్ధి చేసుకోవడమే గాక  తనను తాను సంస్కరించుకునే ప్రయత్నం కూడా చేయాలి అంటారు. 'కవిత్వ వాస్తవికత'  లక్షణాలుగా ప్రాథమిక అనుభవం జీవానుభవంగా వర్ణిస్తూ భౌతికం, అభౌతికం, విభౌతికం అనే లక్షణాలను కూడా ప్రస్తావించారు. కవిత్వంలోని వస్తువు కాని, సంవేదనలు కాని పాఠకుడికి  సంబంధింవినవి.  కనుక కవిత్వంలో కవి గాక కవిత్వం కనబడాలి  అంటారు. అందుకు గ్రీకు కథను, రంగుల ఉదాహరణను, bipolar విశేషణాలు ఉదాహరించారు. వాస్తవికతను దర్షింప జేసే కవితల ప్రస్తావన తీసుకు వస్తూ శ్రీ శ్రీ, గుల్జార్ ఇంకా ఇతర కవులను ప్రస్తావిస్తారు. 

Latest Videos

undefined

అధ్యక్ష స్థానంలో వున్న డా. రూప్ కుమార్ డబ్బీకార్ ' సిద్దార్థ  ప్రసంగ విశేషణాలు తెలిపారు.  ' కవిత్వ వాస్తవికత ' ను ఉద్దేశిస్తూ Poetic Realism గా వచ్చిన కవిత్వ లక్షణాలను తెలుపుతూ  ‘కవిత్వ వాస్తవికత’ literary movement గా వచ్చిన తీరు, రియలిజంకు ఆద్యుడైన ఫ్రెంచి నవలా రచయిత , విమర్శకుడు  హెన్రీ బెయిల్ కు సంబంధించిన విశేషాలు తెలిపారు. అలాగే తెలుగు సాహిత్యంలో ఈ లక్షణాలతో వచ్చిన కవుల కవిత్వాన్ని ప్రస్తావిస్తూ అమ్మంగి వేణుగోపాల్  కవితను చదివి వినిపించారు. అలాగే కందాళై రాఘవాచార్య, కoదుకూరి శ్రీ రాములు కవిత్వoలో కూడా ఈ లక్షణాలు స్పష్టంగా కనబడతాయి అన్నారు. మునిపల్లె రాజు  నవల 'అస్థిత్వానికి ఆవలి తీరాన ' లో వున్న మాంత్రిక వాస్తవికతను కూడా ఉదాహరించారు.

ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్ సమన్వయ కర్తగా వ్యవహరించిన ఈ సమావేశంలో  కవులు, రచయితలతో   చర్చా కార్యక్రమం కొనసాగింది.  ఈ సభలో గుడిపాటి,  అయోధ్యా రెడ్డి, కందుకూరి శ్రీ రాములు, బెల్లంకొండ సంపత్ కుమార్,  హనీఫ్, వేముగంటి మురళీ కృష్ణ , యరుకల యాదయ్య,  స్వాతి శ్రీపాద, అరుణ నారదభట్ల, గుండెల్లి ఇస్తారి, మోత్కురు శ్రీనివాస్, తిరునగరి శ్రీనివాస్ , సుతారపు వెంకటనారాయణ తదితరులు  పాల్గొన్నారు.

click me!