కర్నూలులో ‘నాగలి కూడా ఆయుధమే..!’ కవితా సంపుటి పరిచయ సభ.

Published : Mar 17, 2024, 05:08 PM IST
కర్నూలులో ‘నాగలి కూడా ఆయుధమే..!’ కవితా సంపుటి పరిచయ సభ.

సారాంశం

కొమ్మవరపు రచించిన కవితా సంపుటి ‘నాగలి కూడా ఆయుధమే..!’ పరిచయ సభ,సాహితీ స్రవంతి-కర్నూలు జిల్లా ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీన జరగనుంది.

ప్రముఖ కవి విల్సన్ రావు కొమ్మవరపు రచించిన కవితా సంపుటి ‘నాగలి కూడా ఆయుధమే..!’ పరిచయ సభ,సాహితీ స్రవంతి-కర్నూలు జిల్లా ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు కర్నూలులోని సి క్యాంపు టిజివి కళాక్షేత్రం నందు జరుగుతుంది.  ప్రముఖ సాహితీవేత్త జంధ్యాల రఘుబాబు అధ్యక్షతన జరిగే ఈ సభకు ప్రముఖ సాహితీవేత్త కోయి కోటేశ్వరరావు ముఖ్య అతిధిగా హాజవుతారు. కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత తగుళ్ళ గోపాల్  పుస్తక పరిచయం చేస్తారు. ఈ సభలో సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు ఆవుల బసప్ప ,  ప్రముఖ కథకులు కెంగార మోహన్, పేరం ఇందిరాదేవి, మారుతి పౌరోహితం, డి.అయ్యన్న, ఆవుల చక్రపాణి, కవి కొమ్మవరపు విల్సన్ రావు పాల్గొంటారు

PREV
click me!

Recommended Stories

Tim Cook books టిమ్ కుక్ ని మార్చేసిన పుస్తకాలు.. చదివితే మనకూ స్ఫూర్తి పాఠాలు
అపరాజిత అయోధ్య : రామాలయ చరిత్ర, శతాబ్దాల పోరాటం