పాలమూరు సాహితి అవార్డు కోసం నిర్వాహకులు కవితా సంకలనాలను ఆహ్వానిస్తున్నారు యేటేటా ఇచ్చే అవార్డు కోసం ఉత్తమ కవితా సంకలనాన్ని ఎంపిక చేసి అవార్డు అందజేస్తున్నారు.
తెలుగు సాహిత్యంలో ఉత్తమ వచన కవిత్వాన్ని ఆవిష్కరిస్తున్న కవులకు పాలమూరు సాహితి అవార్డును గత దశాబ్దకాలంగా ఇస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే 2020 సంవత్సరంలో ముద్రితమైన వచన కవితాసంపుటాలను కవుల నుండి ఆహ్వానిస్తున్నాము. కవులు మూడేసి ప్రతులను మార్చి 30 లోపు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, ఇం.నెం.8-5-38,టీచర్స్ కాలనీ, మహబూబ్ నగర్-509001 అనే చిరునామాకు పంపగలరు. బహుమతి పొందిన కవితాసంపుటికి 5,116/- నగదు బహుమతితో పాటు జ్ఞాపికను అందజేస్తారు.
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, వ్యవస్థాపకులు,
పాలమూరు సాహితి అవార్డు
9032844017