కవయిత్రి అయిత అనిత రెడియో స్వగతం పేరు మీద ఓ కవితను అందించారు. ఆ కవితను మీ కోసం ఇక్కడ ప్రచురిస్తున్నాం. చదవండి.
బుల్లి పెట్టెలో బుజ్జిపాపాయిలా
మీ అందరి మధ్య ఒదిగిపోయాను
ఒకప్పుడు!
సంపతి వార్తాహ శూయంతి అంటూ
నలు దిక్కుల సమాచారాన్ని మోసుకొచ్చాను!
మీ విజ్ఞాన వికాసానికి తోడ్పడ్డాను!!
రైతన్నలకు నేస్తాన్నై
పాడిపంటలు కురిపించాను!
క్రికెట్ ముచ్చట్లను చెప్తూ
యువతను ఆనందింపజేసాను!!
బాలల సృజనాత్మక పెరుగుదలకై
బాలానందం వినిపించాను!
దేశభక్తి గీతాలను నేర్పతూ
మీతో చెలిమి చేసాను!!
హాస్యం...
చిత్రగీతాలను ప్రసవిస్తూ
ఆకాశవాణినై అలరించాను!
పడతులకు కాలక్షేపంగా
నాటికలను వినిపించాను!!
సిలోన్ పాటలు జనరంజనితో
మనోరంజకం గావించాను!
కానీ..
టివీలు సెల్లలలు మోజులో లీనమై
నన్నే మరిచారు!
వాటికి పెద్దపీఠ వేసి
నన్ను మూలకు నెట్టారు!
పాత సామానువాడికి బహుకరించారు!
నా భాగాలు ఒక్కొక్కటి చిద్రమవుతుంటే
నా గుండెలవిసిపోతున్నాయ్!