ప్రముఖ కవి మద్దా సత్యనారాయణ ఆత్మహత్య

By telugu team  |  First Published Mar 19, 2021, 8:29 AM IST

ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ కవి మద్దా సత్యనారాయణ ఆత్మహత్య చేసుకున్నారు. తన నివాసంలో పురుగుల మందు సేవించి ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు.


కాకినాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ కవి, సామాజిక కార్యకర్త మద్దా సత్యనారాయణ ఆత్మహత్య చేసుకున్నారు. పురుగుల మందు సేవించి ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. సత్యనారాయణ స్వస్థలం కరప మండలం గురజనాపల్లి గ్రామం. ఆయన పలు రచనలు చేశారు.

పెద్దల మాట చద్దిమూట, మద్దావారి మణిపూసలు, తరువోజ, బధిరుడు, పదవులున్నోళ్లకు పసుపు కుంకుమలు, ఆశాజ్యోతి అంబేడ్కర్, నల్లధనంపై వేటు వంటి పలు రచనలు చేశారు. 

Latest Videos

ఆయన ఇండియన్ ఎయిర్ ఫోర్సులో పనిచేశారు. ఒక వైపు రచనలు చేస్తూనే ఆయన మరోవైపు అక్షర సేవా సంస్థను నెలకొల్పారు. దాని ద్వారా ఆయన సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు 

కుటుంబ కలహాల నేపథ్యంలో ఆయన పురుగుల మందు తాగి మరణించారు వెంటనే ఆయనను కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సత్యనారాయణ తుదిశ్వాస విడిచారు.

click me!