దర్భముళ్ల తెలుగు కవిత: ఆహా! ప్చ్!!

By telugu team  |  First Published Mar 18, 2021, 4:50 PM IST

దర్బముళ్ల గొంగళి పురుగులాంటి జీవితాల గురించి తన కవితలో మాట్లాడుతున్నారు. ఆ కవిత చదవండి.


రెండూ శవయాత్రలే 
నక్కి నక్కి నత్త పాకినట్లు 
గొంగళి పురుగు నునుపు గచ్చున నిమ్మళంగా జారినట్లు
బురద లోంచి వానపాము సాగుతూ సాగుతూ సాగినట్లు
రెక్కలు తెగిన  పక్షి ఆగాగి అర అంగుళమే
ఎగిరినట్లు 
నెమ్మదిగా నడుస్తున్నాయి......!!!

చిన్న తేడా అంతే.......

Latest Videos


అది.....
చలిస్తూ ఉన్న జాతర
దారి నిండా డస్సి పోని డప్పుల గోల 
ఈలలు... పూల జల్లులు...
ఘుమ్మని గాలి నిండా  గమ్మతైన డబ్బు వాసన 
అడుగడుగునా పోలీసు పహారా...
అది మరణం తరువాతి మహాప్రస్థానం ....
ఆహా!!!

ఇది 
భయం..జుగుప్స..రోత 
నాల్గు భుజాల అండ ముళ్ల దారి డొంకలు...
గాలి నిండా గుబులునింపే చావువాసన 
అడుక్కుని బేరమాడితే గాని 
కట్టె కాల్చని  కాటి-కాపరి సహారా 
ఇది చచ్చినోడ్ని ఎలాగైనా వదిలించుకునే చివరి తంతు....
ప్చ్!!!

click me!