కోపిష్టి సైతం తియ్యటి తాంబూలం నమిలితే మధురం కోపాన్ని మాయం చేస్తుంది ! అంటూ కందాళై రాఘవాచార్య రాసిన కవిత ' మీఠాపాన్ ' ఇక్కడ చదవండి.
భక్ష భోజ్య లేహ్య నానా రుచుల
సందడి సందడి విందు భోజనం చేసాకా
అన్నింటి కన్నా దర్జాగా మీఠాపాన్
నిండుగా నోట్లోకి రానే వస్తుంది
ఆలస్యమే లేదు !
అన్నింటిని మరిచేలా నోటిలో తాంబూలం రాజ్యమే !
నమిలినా కొద్దీ మిఠాపాన్ నాల్క పై చెలిమె చెలిమె !
ఎరుపు రంగుతో నాల్కకు మేకప్ చేస్తుంది మీఠాపాన్
కోపిష్టి సైతం తియ్యటి తాంబూలం నమిలితే
మధురం కోపాన్ని మాయం చేస్తుంది !
undefined
ఇచ్చిన పాన్ నమిలినాకా దుష్మన్ బీ దోస్త్ !
మీఠాపాన్ మాయలో పడితే మాటలే మాటలు
అలుగు వారినట్లు !!
గొప్ప వక్తనే
మీఠాపాన్ లు కట్టించే
చిన్న పాన్ కోకా సైతం అంగడంగడే
అందరూ మీఠాపాన్ అభిమానులు
కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు !
అందరి నోట మీఠాపాన్ మాట
భిన్నత్వంలో ఏకత్వం !