పాల‌పిట్ట పత్రిక సాహిత్య వ్యాసాల పోటీ... ఎం.నారాయ‌ణ‌శ‌ర్మకు ప్రథమ బహుమతి

By Arun Kumar P  |  First Published Dec 22, 2021, 4:37 PM IST

పాలపిట్ట మాసపత్రిక నిర్వహించిన సాహిత్య విమ‌ర్శ‌, ప‌రిశోధ‌నా వ్యాసాల పోటీ ఫలితాలు వెలువడ్డాయి. 


హైదరాబాద్: ప్రముఖ తెలుగు మాసపత్రిక పాలపిట్ట సాహిత్య విమ‌ర్శ‌, ప‌రిశోధ‌నా వ్యాసాల పోటీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పోటీలో చాలామంది రచయితలు ఈ పోటీలో పాల్గొని వారి రచనా ప్రతిభను కనబర్చారు. ఈ వ్యాసాల పోటీ ఫలితాలను పాలపిట్ట యాజమాన్యం విడుదలచేసింది. 

ప‌రిశోధ‌న మీద ఆస‌క్తి క‌లిగిన వారు చాలామంది వ్యాసాలు పంపించారని... అలాగే విభిన్న ప్ర‌క్రియ‌ల‌కు సంబంధించిన విమ‌ర్శ‌నా వ్యాసాలు వ‌చ్చాయని నిర్వాహకులు తెలిపారు. విమ‌ర్శ‌, ప‌రిశోధ‌న‌ల మీద ఆస‌క్తితో కృషి చేస్తున్న‌వారు తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఉన్నార‌ని ఈ పోటీ తెలియ‌జెప్పిందని పాల‌పిట్ట సంపాదకులు గుడిపాటి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ పోటీలోపాల్గొన్న వారంద‌రికీ ఆయన ప్రత్యేక ధ‌న్య‌వాదాలు తెలియజేశారు.

Latest Videos

బ‌హుమ‌తుల వివ‌రాలు:  

ప్ర‌థ‌మ బ‌హుమ‌తిః వ‌చ‌న క‌విత - శిల్పానుశీన - ఎం.నారాయ‌ణ‌శ‌ర్మ
ద్వితీయ బ‌హుమ‌తిః వికాసం నుండి విస్తృతి - బి.వి.ఎన్‌. స్వామి
తృతీయ బ‌హుమ‌తిః  త‌ప్త హృద‌యుని మ‌త్స్య‌గ్రంథి - డా.సిహెచ్‌. సుశీల‌మ్మ

ప్ర‌త్యేక బ‌హుమ‌తులు :
1. ఊహ భంజికలు అల్లిన నవల- మనోధర్మపరాగం - డా. పి. విజ‌య‌ల‌క్ష్మీ పండిట్
2. తెలంగాణ భావ‌క‌వితా విద్వ‌న్మ‌ణి - నందిగామ నిర్మ‌ల‌కుమారి 
3. బ‌హుజ‌నుల క‌ళారూపం -భ‌జ‌న - పిల్లా తిరుప‌తి రావు 
4. అనువాద ప్రక్రియ-సాధక బాధకాలు:ఒక పరిశీలన - వేలూరి కృష్ణ‌మూర్తి
5. సాంఘిక జీవ‌న స‌మ‌గ్ర వ‌ర్ణిక - సింహాస‌న ద్వాత్రింశిక - డా. బోయిన్‌ప‌ల్లి  ప్ర‌భాక‌ర్ 
6. హైకవే సంపుటాలు - కాలాన్ని శ్వాసించే కవిత్వం - మండ‌ల స్వామి
7. ఈ ద‌శాబ్ద క‌వితా ధోర‌ణులు - ఒక ప‌రిశీల‌న - తాటికొండాల న‌ర‌సింహారావు 
8. తెలుగు సాహిత్యంపై రుబాయిల ప్ర‌భావం - అమ్జ‌ద్
 

click me!