హిమజ తెలుగు కవిత: కీలాయ నమ

Published : Dec 22, 2021, 03:04 PM IST
హిమజ తెలుగు కవిత: కీలాయ నమ

సారాంశం

సుతిమెత్తగా కవిత్వం రాసే'హిమజ'మొదటి పుస్తకం ఆకాశమల్లె’కి సుశీల నారాయణ రెడ్డి అవార్డు (2006) , రెండవ కవిత్వ పుస్తకం ‘సంచీలో దీపం’ కి రొట్టమాకు రేవు (2015)అవార్డులు  వచ్చాయి. 'మనభూమి'మాస పత్రిక లో 'హిమశకలం' పేరుతో ఓ శీర్షికని సంవత్సర కాలం పాటు నిర్వహించారు 

నే లేకుంటే ఇల్లే నడవదని
ఆకాశం విరిగి పడుతుందని
విర్ర వీగిన కాలు
ఒక్క  ఎపిడ్యురల్ సూదితో
ఆపరేషన్ బల్ల మీద
అచేతనమవుతుంది

నిపుణులైన వడ్రంగి వైద్యుల
రంపపు కోతల్లో లోహపు కీలు
నేర్పుగా కాలిలో ఒదిగిపోయినా
దేహాన్ని దిగ్బంధనం చేసిన
ప్లాస్టిక్ తీగల మధ్య
విదేశీ భాగాన్ని బుజ్జగించడం
అంత తేలికేమీ కాదు
ఆసుపత్రి విడిదిలో
కఠిన కసరత్తులు, ఫిజియోలు
నొప్పిని కన్నీటిని కలిపేస్తాయి
కేకలు హాహాకారాలు మర్యాదలని
మరచిపోతాయి

తప్పదు
ఇన్నాళ్ళ అలసత్వం
చెల్లించే మూల్యమిది
ఓ మూన్నెళ్ళ తరువాత
నొప్పిలేక నడిచే కాలు
సంతోషాల నవ్వు పూలు
పూయించక మానదు
ఎప్పుడైనా దేనికైనా....
Recovery is a process
it takes time
it takes patience !!

PREV
click me!

Recommended Stories

Tim Cook books టిమ్ కుక్ ని మార్చేసిన పుస్తకాలు.. చదివితే మనకూ స్ఫూర్తి పాఠాలు
అపరాజిత అయోధ్య : రామాలయ చరిత్ర, శతాబ్దాల పోరాటం