ఒబ్బిని కవిత 'జల శార్దూలం'

By telugu team  |  First Published Aug 27, 2021, 4:32 PM IST

ఒబ్బిని కవిత 'జల శార్దూలం' ఇక్కడ చదవండి.


కరువుకి తొలకరి ఓ చిరునవ్వు !
జారిన చినుకు టీకాలు తొలుత నీటి లింగాలై , 
నీటి గాజులై,
ఆపై నీటి పులులవుతూ రోడ్ల మీద .....
వివేకానందం విగ్రహాలకే అంటుకొని ఉంది
పరిమళించడం లేదు 
దేశ కాలం
ఉక్కు కండరాలని  నుగ్గు నుగ్గు చేస్తుంది !
నయా పురాణాలకి తెర లేస్తుంది
భూకంపాల్లా నోర్లు తెరుస్తూ
దిక్కులని పీక్కు తింటూ దిక్కులేని దేశాన్ని                           
                                              గీస్తున్నారు !
అంతరిక్షపు సైన్స్ మీద ఆకాశపు పిడుగుల 
                                                  పిడిగుద్దులు !
శాస్త్రమంతా వ్యాపారమైపోతూ...
వ్యాపారమంతా లక్ష్మణరేఖలు వొంటపట్టించుకోనిదై.....
జన్మం కర్మం జారుడు బల్లాటతో
జావగారుతున్న ఊపిరి జీవులు –
వికలాంగత్వం విగత జీవితం కాదు
ఆకుల చేతుల గాలిని ఊపిరి జేసి
పాదాలకి ఇసుక గూళ్ళు కడితే
అంధత్వం అరవై సూర్యుళ్ళుగా మారుతుంది !
దేశ దేశాల దేహాలన్నిటినీ
కొరుక్కుతింటున్న క్రిములు !
వెదురు కర్రలే ఎదురొస్తున్నాయి!
వీచే గాలిని పీల్చలేని
విష నాసికత్వం !
జన్మలనీ జీవితాలనీ జయించలేని
నుదురు మైదానం తొక్క లేని జడ బోయీతనం!

            ***

Latest Videos

ఒకటే లొల్లి
దేశ దేశాల కప్పలూ కాకులూ
లోల్లే లొల్లి లోల్లే లొల్లి
కప్పలూ కాకులూ రాజ మైకుల్లా ...

click me!