సాహిత్యంలో ఈ ఇద్దరికి నోబెల్ బహుమతి

By telugu team  |  First Published Oct 10, 2019, 9:07 PM IST

ఆస్ట్రియన్ రచయిత పీటర్ హండ్కేకు 2019 సంవత్సరానికి గాను సాహిత్యంలో నోబెల్ బహుమతి లభించింది. 2018 సంవత్సరానికి గాను సాహిత్యంలో నోబెల్ బహుమతికి పోలండ్ కు చెందిన రచయిత్రి ఓలాగ్ టోకార్జక్ ను ఎంపిక చేశారు.


న్యూఢిల్లీ: ఆస్ట్రియన్ రచయిత పీటర్ హండ్కేకు 2019 సంవత్సరానికి గాను సాహిత్యంలో నోబెల్ బహుమతి లభించింది. భాషా చాతుర్యతో ప్రభావశీలమైన అసమాన కృషితో పాటు మానవానుభవం విశిష్టతను అన్వేషిస్తూ చేసిన రచనలకు గాను ఆయనకు ఈ అవార్డు లభించింది. 

ద్వితీయ ప్రపంచ సంగ్రామం తర్వాత ఐరోపాలో అత్యంత ప్రభావవంతమైన రచయితల్లో ఒక్కడిగా పీటర్ హండ్కే ఎదిగారని సాహిత్యంలో నోబెల్ బహుమతి ప్రకటించిన స్వీడిష్ అకాడమీ చెప్పింది. 

Latest Videos

2018 సంవత్సరానికి గాను సాహిత్యంలో నోబెల్ బహుమతికి పోలండ్ కు చెందిన రచయిత్రి ఓలాగ్ టోకార్జక్ ను ఎంపిక చేశారు. స్వీడన్ వ్యాపారవేత్త, కెమిస్ట్, ఇంజనీరు ఆల్ ఫ్రెడ్ నోబెల్ అభీష్టం మేరకు ఐదు అంతర్జాతీయ అవార్డులను నెలకొల్పారు. వాటిలో సాహిత్యంలో నోబెల్ బహుమతి ఒకటి. 

వైద్యంలో ఈ ఏడాదికి గాను విలియం కెలిన్, పీటర్ జె రాక్ట్ క్లిఫ్, గ్రెక్ ఎల్ సెమెంజలకు నోబెల్ బహుమతి లభించింది. విశ్వం ఆవిర్భావం గుట్టును విప్పినందుకు శాస్త్రవేత్తలు జేమ్స్ పీబల్స్, మైఖేల్ మేయర్, ఖ్వెలోజ్ లను ఫిజిక్స్ నోబెల్ బహుమతి లభించింది. 

click me!