బ్రహ్మపుత్ర 2 పేరు మీద కవి నిర్గుణ్ ఓ కవితను రాశాడు. అస్సామీ పాట పంక్తులను ఈ కవితలో ఆయన ఈ కవితలో వాడుకున్నాడు.
మనిషిని మాత్రమే ఇక్కడ
మనసునెందుకే అక్కడే కట్టేసుకున్నావ్
తేయాకు తోటలా ఆకుపచ్చ వంటికి
మట్టిరంగు చీరెను వళ్ళంతా చుట్టుకున్న నిన్నొదిలి
నా మనసెందుకే రాను అంటుంది ?
ఏం మాయ చేసావే నీ నడుం ఒంపులో
బ్రహ్మపుత్రను తిప్పుకుంటున్నట్టు
నా ఆలోచనలనీ
ఆ నీలం రంగు కళ్ళ చుట్టూ
కాపలా పెట్టుకున్నావు కదే
ఒసేయ్ ! నా బిహూ సువాలి
ఈ చాయ్ కప్పులోంచి సెగలా
నా ఒంట్లో సెగరేపావ్ కదే
అలా పెదవి మీదినుంచి జారితే జారావు గానీ !
ఈ దిల్ లోంచి జారకే
నా అస్సామీ గరం గరం చాయ్
బిదేశీ బిదేశీ నాజాబా
మోకో ఏరి థై, మోకో ఏరీ థై
మోర్ విదేశీ వున్ద్ తోమార్ కథా రాఖీబా
మోకా మతిబ్ రాఖిబా ,కెతియాయో పాహరి నాజాబా ....
( అస్సామీలోకి పర్దేశీ పర్దేశీ జానా నహీ ఆమేర్ ఖాన్ నటించిన రాజా హిందూస్తాని సినిమా పాట తర్జుమా చేస్తే - చివరి పంక్తులు - ఇలా)
- నిర్గుణ్