తెగిన బతుకుల్ని చిత్రించిన ‘‘గాలిపటం’’

By telugu team  |  First Published Oct 12, 2019, 12:02 PM IST

 ప్రస్తుతం దేశమంతా దేశమంతా ‘మీ టూ’ ఉద్యమంలో బాధితులు నేను సైతం అంటూ ముందుకొస్తున్నారు. అలాంటి స్థితిపై 70 ఏళ్ల క్రితం వట్టికోట ఆళ్వారుస్వామి తన గాలిపటం కథలో చిత్రించారు.


కథలు, నవల ద్వారా తెంగాణ అస్థిత్వాన్ని బహుముఖ కోణాల్లో ఆవిష్కరించిన ప్రజారచయిత వట్టికోట ఆళ్వార్‌ స్వామిగారు. వారి నవలు ‘మట్టిమనిషి’, ‘గంగు’ ద్వారా తెంగాణ జీవితాన్ని ఆవిష్కరించారు. ‘జైలు లోపల’ అను కథద్వారా మరుగునపడి ఉన్న ఎతను మరిచిపోకుండా చిత్రించాడు.  అందులోని ‘గాలిపటం’అను కథ చదివిన తర్వాత పాఠకుని మనసు మనసు ఉండదంటే ఆశ్చర్య పోవలసిన అవసరం లేదేమో. ఈ కథను తెంగాణ సాహిత్య అకాడెమీ ద్వారా ప్రచురించిన ‘మూడుతరాల తెలంగాణ కథ’లో ప్రచురించడం ద్వారా మంచి కథను పాఠకులకు అందించారు. అందులో నాకు బాగా నచ్చిన కథ ‘గాలిపటం’.

 ప్రస్తుతం దేశమంతా దేశమంతా ‘మీ టూ’ ఉద్యమంలో బాధితులు నేను సైతం అంటూ ముందుకొస్తున్నారు. అచ్చం అలాంటి బతుకును కడు దయనీయంగా మార్చిన జీవితాన్ని దాదాపు డెబ్బయి యేళ్ళ క్రీతమే (1952లో) చిత్రించిన కథ ఇప్పటికీ నవనవలాడటం రచయిత గొప్పతనానికి పరాకాష్ట. మనసును మెలిపెట్టే కథ గాలిపటం అని చెప్పక తప్పదు.

Latest Videos

ఇక కథ విషయంలోకి వెళితే రచయిత అనారోగ్యంతో వైద్యున్ని సంప్రదిస్తే నాలుగు నెలల మందు ఇచ్చి నీకింకా పరవాలేదు. నీవు వజ్రకాయుడివి. నీవు రోజు పరిగడుపున పావుసేరు పాలు తాగాలని సలహా ఇస్తాడు. రచయిత ఎన్నో దుకాణాలను పరిశోధించిన గాని స్వచ్చమైన పాలుదొరకక పోవడం వలన చివరికి తన మిత్రుడు సీతయ్యను వాకబు చేసినపుడు ‘‘మనుషుల్నే కల్తీ చేస్తున్న ఈ రోజుల్లో స్వచ్చమైన ఆవుపాలు ఎట్లా దొరుకుతాయంటాడు.

రచయిత రోజు ఆఫీసుకి వెళ్ళే మార్గంలో చిన్న దుకాణంలో స్వచ్చమైన పాలు పెంటయ్య మామ వద్ద దొరుకుతాయని కిటికీలోంచి ఒకమ్మాయి చెబుతుంది. తెలియగానే రచయిత పాలు అమ్మే ముసలాయన్ని అడుగుతుంటాడు.

లోపలనుంచి ఒక యువతి వచ్చి రోజు ఎన్నిపాలు కావాలి ఎప్పుడు దుకాణంలో నేనే ఉంటా అని మోహపు చూపుతో దాడి చేస్తుంటే రచయిత తల దించుకొని గుటకాలు మింగుతూ జవాబిస్తాడు. ఆమెచే మామ అని పిలువబడుచున్న ముసలాయన రచయితతో ముగ్గురు పిల్లల తండ్రివి. అందమైన మగాడివి. నీవు పక్కకు తొలిగినంత మాత్రాన ఉద్దారకం లేదు. ఎవరో ఏదేదో చేస్తుంటారనీ బాధపడుతుంటాం కానీ అటువంటి పరిస్థితి ఏర్పడినప్పటికిగాని మనకు అర్థం కాదు అని జవాబు ఇస్తాడు.

జరిగిన విషయం పూసగుచ్చినట్లు తన భార్యకు చెబితే మనిషి పాలు దొరుకుతాయో కనుక్కోపోయావ అని రచయిత భార్య ఆటపట్టిస్తుంటది. మూడు నెల్ల తర్వాత రచయిత అటువైపు వెళ్ళినపుడు ఆ ముసలాయన లేనపుడు యువతి పిలిచి మరీ ‘‘లెక్క చూసుకోకపోతివి.’’ వెనుదిరిగి చూసిన రచయితకు ‘‘నిన్నే రమ్మన్నది’’ చేతులాడి౦చుకు౦టూ అన్నది. డబ్బు ఇస్తూ లెక్క సరిగ్గా చూస్తున్నానే అంటాడు. రచయితను వింతగా చూస్తు... ‘’ముసలాయన లేడు? ఎక్కడ పోయాడు? అని అడిగినపుడు ‘‘నీ కోసం మీగడ దాచి ఉంచిన తినరాదు!’’ అని అన్నది. కల్తీ లేని పాలు పోస్తున్నావా? అని విషయం మార్చాడు. ఆ యువతి ఎందుకు లేదు. నీకు నూక్సాన్‌ చెయ్యదులే మరింత బలమే వస్తది అని కొంటేగా చూసి ఫక్కుమంది. రచయిత ప్రశ్నార్థకంగా చూశాడు. ‘‘నా పాలే కలుపుతున్న’’ రాత్రి ఎనిమిది గంటలకు వస్తే...’’ సమాధానానికై నిరీక్షిస్తున్నట్లు తల నేలకేసింది.

రచయిత ఎనిమిది గంటలకి వెళ్ళేవారకు తయారయ్యి ఉంది. అంతలో రచయిత మిత్రుడు మల్లేశం ఆ బాటన పోతూ ‘‘ఇక్కడ నిలుచున్నవెందుకో?’’ అని ప్రశ్నిస్తున్నాడు. ఆ యువతి మల్లెశాన్నీ సమయానికి వీడేవడో తారసిల్లిండు అని క్రోధంగా చూడసాగిందని ఆమె కనుబొమ్మలు ప్రకటిస్తున్నాయి. అప్పటికే రచయిత కంటే మల్లేశంకే ఆమె గురించే ఎక్కువ తెలుసు. ఆమె జీవితం గాలిపటం వలె ఉండనివ్వద్దు అని రచయిత అనుకున్నాడు. మల్లేశం చేయూత నిస్తానన్నాడు. మల్లేశం రచయిత ఇంటికి వెళ్ళి రచయిత భార్యకు చెప్పుతాడు. నిర్ణయాన్ని వివరిస్తారు.

రచయిత ఆ యువతి పబ్లిక్‌ గార్డెన్స్‌ లో ఎదురుపడి కూర్చుంటారు. వీరికి కాస్త దూరంగా అనామకుని వలె మల్లేశ్‌ దూరంగా కూర్చు౦టాడు. ‘‘నీకు పెండ్లి అయిందా?’’ అని రచయిత అడిగితే మూడుసార్లని జవాబిస్తుంది. ఆ ముసలాయనకి నీకు ఏమి సంబందం అని అడిగినపుడు నాకు ఆయనకు నాకు ఏం సంబంధం అని తిరుగు ప్రశ్న వేస్తుంది. మల్లీ అడిగినపుడు పెళ్లి చేస్తానని తీసుకొచ్చిండు. ‘‘పెండ్లీ లేదు, పెడాకులు లేదు. అందరూ పెండ్లి చేస్తానని యీడికి తెచ్చిండ్రు.’’ అని కన్నీరు తుడుచుకుంటూ బాధ చెబుతుంది. రచయిత తల దిమ్మ దిరిగింది. 
ఎందుకేడుస్తున్నావు అని ఓదార్పుతో రచయిత అడుగుతాడు. ‘‘ఇల్లు, పిల్లలతో సంసారం చేద్దామని నాకు అనిపించదా? మా మామ మందికి భయపడి లేకలేక పుట్టిన పసిగుడ్డుని మాయం చేసిండు’’ అని చిన్న పిల్లలా ఏడుస్తూ చెప్పుతుంది.

రచయితకు కళ్లలో నీళ్ళు తిరిగినయి. చావ సిద్దమైన ముసలాడు ఎంత సాహసం చేశాడు అని మనసులో అనుకుంటాడు. పెండ్లి చేసుకొని హాయిగా ఉండరాదు అని రచయిత సూచిస్తాడు. ‘‘నీకు పెండ్లి అయింది కదా?’’ అని యువతి అడుగుతుంది. రచయిత అవును మరి నన్నెందుకు ఎనిమిది గంటలకు రమ్మన్నావు అడుగుతాడు. మీ మొగొల్లకు పెళ్లైతేనేమి అని మరేదో అనబోయి ఊరుకుంది. జరిగింది ఏదో జరిగి పోయింది ఊరికివెళ్లుమంటాడు. ఎన్ని తీర్లా చెప్పిన ఊరికి పోనంటది. ఇక్కడేవారినైనా పెండ్లి చేసుకుంటావా అని రచయిత అడిగితే మా మామ ఒప్పుకోవడం లేదు. ఐనా వ్యాపారం దెబ్బతినదు అని అంటుంది. ‘‘అదంతా కాదు మంచి పిల్లవాన్ని పెళ్లి చేస్తాం ఏమంటావు?’’ అని బతిమాలుతాడు.

‘‘ఇంతకు ముందు పెండ్లి చేయించినోళ్ళు, చేసుకున్నోళ్ళు గిట్టనే మాట్లాడిoడ్రు’’ అన్నది జవాబుకు ఎలా చెప్పాలో రచయితకు అర్థంకాలేదు. ‘‘నాకు పాలు తాపడంలో నీ అభిప్రాయం?’’ రచయిత ప్రశ్నించాడు. ‘‘రోజు పాలు పిండి పారపోయడము నా మనసు ఒప్పలేదు. నీకు పోసే పాలల్లో  కలిపిన’’ అని గుడ్లల్ల నీళ్ళు తీసుకొన్నది.

‘‘నీ పాలు తాగే నా మీద కన్నేయడం మంచిది కాదనుకోలే?’’ అని రచయిత ప్రశ్నకు జవాబుగా నేనుకున్నట్లు ఏది జరుగుతుందంటుంది. ఇంకెంత సేపు ఇలా కూర్చుందామని తల నేలకెసి అన్నది. రచయిత ఆ యువతిని ఒప్పించి తన ఇంటికి తీసుకపోతాడు. లేచి మళ్లుతున్నపుడు ఏమంటుందో మల్లేశం తెలుసుకుంటాడు. ఎవరినీ నమ్మని జీవితం అయింది అని అంటాడు. మల్లేశంని చూసి భయపడుతున్న ఆ యువతికి నా మిత్రుడని పరిచయం చేస్తాడు. నన్ను మీ ఇంటికి తీసుకెలుతావంటున్నావు ఈ విష్యమంతా మీ ఆమెకు ఎరికేనా? అని ఆమె అడిగినపుడు అవునంటాడు.

ఇంటికి తీసుకు వెళ్ళి నమ్మకం కలిగేలా చెప్పి చూడంటాడు. మా వారు నమ్మకస్తులని రచయిత భార్య చెబుతుంది. మల్లేశాన్ని చూసి ఇతడేనా అని ఆ అమ్మాయిని ఓరకంట చూసింది. ఏం మల్లేశం గారు మాట అన్నాక వెనక్కి పోవద్దు అంది.. తిరుగుంటుందా? మేడమ్‌ అంటాడు. ‘‘అయితే మీ పెళ్లి నిశ్చయం’’ రచయిత భార్య అన్నది. ఆ అమ్మాయి అమాంతంగా వచ్చి రచయితని కౌగిలించుకున్నది. చేపిన పాల రొమ్ములు రచయిత చొక్కాను తడిపాయి.

పాపం అంటూ రచయిత భార్య కన్నీరు పెట్టుకుంది.

- డాక్టర్ సిద్దెంకి యాదగిరి  

click me!