కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో దాన్ని ఎదుర్కునే చైతన్యాన్ని కల్పించడానికి తెలుగు కవులు కవిత్వం రాస్తున్నారు. ఈ నేపథ్యంలో మద్దిరాల సత్యనారాయణ రెడ్డి మాస్క్ మంచిదే కవిత రాశారు.
ఇవాళ వ్యవస్థను మాస్క్ పాలిస్తుంది.
లోకంలో ఎక్కడ చూసినా దాని మార్క్ కనిపిస్తుంది.
ప్రాణాయామంలో గాలిని బంధించినట్టుగా. మూతులను బంధించి .
లాక్ డౌన్ విధించింది.
మూతులకు గుడ్డ లేకపోతే.
సమాజం అనుమానపు చూపులతో .
గాయపరిచి అవహేళన చేస్తోంది.
రోడ్డు మీద కనిపించిన.
చెత్తంతా కడుపులో వెయ్యకుండా .
మోకాలడ్డు పెడుతుంది.
అనవసరమైన మాటలకు అడ్డుకట్ట వేస్తూ .
నిశ్శబ్ద లోకాన్ని సృష్టిస్తూ.
ఎడ్ల మూతులని శిక్కాలు బంధించినట్టుగా. మానవుల నోటిని బిగించింది.
మందిలో సంచరిస్తున్న మనుషులకి .
ఒక రక్షణ కవచంలా ఉండి.
మనోధైర్యాన్ని అందిస్తుంది.
స్వచ్ఛమైన గాలిని అందించే వృక్షంలా .
మానవ దేహాలకు సహాయపడుతుంది.
మాస్క్ లేని ప్రాణం .
గాలిలో దీపంలా కొట్టుమిట్టాడుతుంది.
దారిన పోయే దానయ్య కైనా .
మాస్క్ తప్పనిసరి.
అది ఉంటేనే సమాజం నిన్ను తిరిగనిస్తుంది.
లేకుంటే చలానా విధిస్తుంది
మరింత సాహిత్యం కోసం క్లిక్ చేయండి: https://telugu.asianetnews.com/literature