సినీ నటుడు ప్రియదర్శి తండ్రి గీతాన్ని ఆవిష్కరించిన కేటీఆర్

By telugu teamFirst Published Jun 12, 2020, 5:50 PM IST
Highlights

సినీ నటుడు ప్రియదర్శి తండ్రి ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి రాసిన తెలంగాణ తల్లి ప్రార్థనా గీతాన్ని ఐటి మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. సుబ్బాచారి గేయాన్ని ఆయన మెచ్చుకున్నారు.

హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు ప్రియదర్శి తండ్రి ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి రచించిన తెలంగాణ తల్లి ప్రార్థన గీతాన్ని మంత్రి కే. తారకరామారావు ఈరోజు విడుదల చేశారు.  తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, చరిత్ర, సాహిత్యం, శిల్ప కళను గురించి వర్ణించే ఈ పాట బాగుందని మంత్రి కే. తారకరామారావు ప్రశంసించారు.

 ప్రొఫెసర్ సుబ్బాచారి రచించిన ఈ పాటకు వి.రాధ సంగీతాన్ని సమకూర్చగా ప్రముఖ సినీ నేపథ్య గాయకులు కృష్ణచైతన్య, కల్పన, హరిణి, సాయి చరణ్ లు ఆలపించారు. 

ఈరోజు ప్రగతి భవన్ లో  ప్రియదర్శి తన తల్లిదండ్రులు, శ్రీమతి తో కలిసి మంత్రి కేటీఆర్ ని కలిశారు. తన తండ్రి తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, చరిత్ర పైన ఎంతో ప్రేమతో రాసిన ఈ పాటను ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్ కి ప్రియదర్శి  ధన్యవాదాలు తెలిపారు.

click me!