వర్జినీయా వూల్ఫ్ కవితలు కొన్ని.....

By telugu team  |  First Published Jun 30, 2020, 11:16 AM IST

అదేలైన్ వర్జీనియా వూల్ఫ్ 20వ శతాబ్దానికి చెందిన ఆధునిక ఫెమినిస్టు రచయిత్రి,కవయిత్రి.ముఖ్యముగా చైతన్య స్రవంతి శైలిలో రాయడంలో దిట్ట. ఆమె కవితలను కొన్నింటిని గీతాంజలీ తెలుగు చేశారు.


అదేలైన్ వర్జీనియా వూల్ఫ్ 20వ శతాబ్దానికి చెందిన ఆధునిక ఫెమినిస్టు రచయిత్రి,కవయిత్రి.ముఖ్యముగా చైతన్య స్రవంతి శైలిలో రాయడంలో దిట్ట.
జనవరి25,1882 లో దక్షిణ కెంసింగ్టన్  ,లండన్ లో జన్మించారు.మార్చ్ 28,1941 లో మరణించారు.
ఆమె ఏఆచాణల్లో ఓర్లాండో,ఏ రూమ్ ఆఫ్ ఒన్స్ ఓన్,టు ద లైట్ హౌస్,మిస్ డాల్లోవే,ద వేవ్స్,గోల్వేన్, విటా&వర్జీనియా సింపుల్ గుఫ్ట్స్,ముఖ్యమైనవి.
చాలా కథలు రాసారు.అన్నీ సంచలనాత్మకమైనవే.

స్త్రీల లైంగిక,లైంగికత అంశాల గురించి, భిన్నలైంగిక ధోరణుల గురించి చాలా సాహసోపేతంగా రాశారు.నిజ జీవితం లో కూడా తనలోని భిన్నమైన అంటే ఏక కాలంలో స్త్రీ పురుషులిదరితో అంటే భర్తతో, తన స్నేహితురాలితో లైంగిక సంబంధాల్లో ఉన్నారు.
అదే సమయంలో సమాజం,కుటుంబం నుంచి వచ్చిన వ్యతిరేకత ను ఎదుర్కొనే సమయంలో తీవ్రమైన మానసిక ఒత్తిడి కి లోనైనారు.అయినా సమాజం ఆమోదించని తన భిన్నమైన ఆలోచనల్ని సాహితీకరించడం మాత్రం మానలేదు

ఆమె "ద వేవ్స్"కవితా సంపుటిలో... ఆమె తన అంతరంగం లోని సంఘర్షణను చిన్న, చిన్న కవితల ద్వారా వ్యక్త పరిచారు.వాటిలో కొన్ని గీతాంజలి తెలుగు లోకి స్వేచ్చానువాదం చేశారు. ఇక్కడ చదవండి.

కవిత 1.

అంతటా నువ్వే.,
అంతటా నిన్నే చూస్తాను.
నక్షత్రాల్లో
నదుల్లో...
నువ్వే కనిపిస్తావు.
ఈ లోకంలో ఉనికిలో ఉన్న సౌందర్యాత్మకమైన ప్రతి  దాంట్లో...నువ్వే ఉంటావు కదా!
ఈ సమస్తంలో.... నువ్వే.,ఒక్క నువ్వే...
ఈ లోకంలో కనిపించే
వాస్తవంలోని 
 సమస్తమూ... నువ్వే ప్రియా.
నువ్వే... ఒక్క నువ్వే...!

Latest Videos

కవిత 2.

వీధి సందుల్లో సందేహాస్పదమైన కదలికలు.
ఎవరో మురికి కాల్వలో సగం తాగిన సిగరెట్టు ముక్క విసిరేస్తారు.
ఇవన్నీ కథలు కాక మరేమిటి?
కానీ ఇందులో ఏది నిజమైన కథ నో తెలుసు కోవడం ఎలా?
అది మాత్రం నాకు తెలీదు సుమా.,
నా చేతులు సముద్రపు అలల్లాగా కదులుతాయి.
అందుకే నేను నా కథల్ని అలమరలోని హాంగర్స్ కి వేలాడేస్తాను.
ఎవరైనా వచ్చి వేసుకుంటారేమో అని ఎదురుచూస్తాను.
అలా ఎదురుచూస్తూ.,
ఊహాగానాలు చేస్తూ.,ఇలా ఏవో రాసుకుంటూనే ఉంటాను.
ఎప్పటికప్పుడు పాతబడిపోయే జీవితాన్ని పట్టుకొని ఏమాత్రమూ వేలాడను.
నేనెలా ఉంటానో తెలుసా...
పొద్దు తిరుగుడు పువ్వులోంచి లేచిన తేనెటీగ లా తళ తళ లాడుతూ ఉంటాను.
క్షణ క్షణం బావిలోంచి ఊరుతూ ..నిండిపోయి ఒక్కసారి ఉవ్వెత్తున  పైకి చిమ్మే పాదరసంలాంటి దాన్ని నేను...
నాలోపలి కొత్త విషయాలతో నా చేతులు సముద్రపు అలల్లగా కదులుతూ ఉంటాయి.

కవిత 3

ఒక స్త్రీగా నాకు ఒక దేశం లేదు.
ఒక స్త్రీగా నాకు ఒక దేశం అవసరమే లేదు.
ఒక స్త్రీగా నేను ఉండే దేశమే ఒక ప్రపంచం.

కవిత 4

నాకు ఏకాంతం కావాలి.
నాకు మాత్రమే స్వంతమైన ఒక స్థలం కావాలి.
నాకు కాసింత స్వచ్ఛమైన గాలి కావాలి.
నాకు నా చుట్టూ నిండి పోయే ఖాళీతనం కావాలి.
వీధుల వెంట దడ దడ మంటూ..శబ్దం చేస్తూ స్వేచ్చగా తిరిగే నా రెండు కాళ్ళు నాకు కావాలి.
నాకు ప్రశాంతమైన కొద్ది నిద్ర కావాలి.
నాకు ఈ భూమి మీద ...
మనిషిగా బతికే హక్కు కావాలి.

కవిత 5.

ఒంటరిగా ..
నేను ఎప్పుడూ.. ఏమీలేనితనంలోకి ...
ఒక ఖాళీ తనంలోకి వొలికి పోతుంటాను.
ఏ మాత్రమూ దాక్కోని నా పాదాలను.,
ఈ భూగోళం అంచులకు చేర్చి.,
అక్కడ్నించి ఏమీలేని శూన్యం లోకి నన్ను నేను  నెట్టి వేస్కుంటాను.
ఆఖరికి.,
నా తలను ఒక కఠినమైన తలుపుకు బాదుకొని.,బాదుకొని.,
నన్ను నేను నా శరీరం లోకి ఆహ్వానించుకొంటాను.
ఒంటరిగా...నాకు నేనుగా.,
ఏమీ లేనితనంలోకి...
ఒక అనంతమైన శూన్యంలోకి 
వొలికి పోతాను.

కవిత6.

కావలిస్తే..,
నీ గ్రంథాలయాలను మూసేసుకో.
నీ ఇంటి తలుపులను బిగించుకో.
నీకు ఒక విషయం తెలియదు.,
అదేంటంటే
నా మనసు నిండిపోయిన స్వేచ్చకు...
గేట్ .,
గొళ్ళెం.,
తాళం.,
వేయ గలవా చెప్పు?

స్వేచ్ఛానువాదం: గీతాంజలి

మరింత సాహిత్య ం కోసం క్లిక్ చేయండి:https://telugu.asianetnews.com/literature

click me!