లిటరరీ ఫెస్ట్-2022 బ్రోచర్ ఆవిష్కరణ

Siva Kodati |  
Published : Nov 04, 2022, 08:19 PM IST
లిటరరీ ఫెస్ట్-2022 బ్రోచర్ ఆవిష్కరణ

సారాంశం

తెలంగాణ సాహితి ఆధ్వర్యంలో నిర్వహించే లిటరరీ ఫెస్ట్-2022 బ్రోచర్ ఆవిష్కరణ నల్లగొండ పట్టణంలోని స్థానిక నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ రోజు జరిగింది.

తెలంగాణ సాహితి ఆధ్వర్యంలో నిర్వహించే లిటరరీ ఫెస్ట్-2022 బ్రోచర్ ఆవిష్కరణ నల్లగొండ పట్టణంలోని స్థానిక నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ రోజు జరిగింది.

ఈ నెల 20, 21 మరియు 22 తేదీలలో హైదరాబాదులోని పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞాన భవనంలో తెలంగాణ సాహితి వారిచే లిటరరీ ఫెస్ట్ నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ వాగ్గేయకారులతో పాటు నవ యువ రచయితలు గాయకులు పాల్గొంటారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో పాటకు పట్టం కడుతూ  అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రముఖుల సందేశాలు, సినీ గీతాల సాహిత్య విశ్లేషణ వ్యాస సంకలనం విడుదల, పరిశోధక పత్రాల సమర్పణ, సినీ వాగ్గేయకారుల పరిచయం మరియు సన్మానాలు ఉంటాయి.  చివరి రోజున కవి సమ్మేళనం నిర్వహించడం జరుగుతుంది.

ఈ బ్రోచర్ ను డిగ్రీ కళాశాల అధ్యాపకులు డాక్టర్ శ్రీమతి గంజి భాగ్యలక్ష్మీ   విడుదల చేయగా  అధ్యాపకులు శ్రీనాథ్ పటేల్, సరిత, తెలంగాణ సాహితి నాయకులు రచయిత బూర్గు గోపికృష్ణ , ఖమ్మం పాటి శంకర్, ఆకారపు నరేష్, తదితరులు పాల్గొన్నారు.

PREV
click me!

Recommended Stories

Tim Cook books టిమ్ కుక్ ని మార్చేసిన పుస్తకాలు.. చదివితే మనకూ స్ఫూర్తి పాఠాలు
అపరాజిత అయోధ్య : రామాలయ చరిత్ర, శతాబ్దాల పోరాటం