తెలంగాణ మహిళా కథల పోటీల ఫలితాలు ప్రకటించారు.తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా (ఆగస్టు 2023) ఈ పోటీలు నిర్వహించారు.
హైదరాబాద్:తెలంగాణ మహిళా కథల పోటీల ఫలితాలు ప్రకటించారు.తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా (ఆగస్టు 2023) ఈ పోటీలు నిర్వహించారు.
బహుళ అంతర్జాల అంతర్జాతీయ త్రైమాసిక స్త్రీవాద పత్రిక,
కెనడా తెలుగు తల్లి మాసపత్రిక సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ మహిళా కథల పోటీ నిర్వహించారు. ఆ పోటీ ఫలితాలు ఇక్కడ చదవండి :
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా (ఆగస్టు 2023) బహుళ అంతర్జాల అంతర్జాతీయ త్రైమాసిక స్త్రీవాద పత్రిక,
కెనడా తెలుగు తల్లి మాసపత్రిక సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కథల పోటీకి రచయిత్రుల నుండి విపరీతమైన స్పందన వచ్చింది.
undefined
న్యాయనిర్ణేతల అభిప్రాయం మేరకు ప్రథమ బహుమతికి యోగ్యమైన కథలు గుర్తించబడలేదు. కనుక ద్వితీయ మరియు తృతీయ బహుమతితోపాటు ప్రత్యేక బహుమతులు ప్రకటించారు.
ద్వితీయ బహుమతి- ఘటన - వై మంజులత -4000/-
తృతీయ బహుమతి- పర్వణి - కళా గోపాల్ -3000/-
ప్రత్యేక బహుమతి : పది కథలను ఎంపిక చేశారు.
1) అసలైన కొడుకు - షహనాజ్ బతుల్
2) మల్లమ్మ కథ - భవ్య చారు
3) బతుకమ్మ - మంజిత కుమార్
4) ఇసపు పురుగుతో ఎన్నేళ్ళు సంసారం - తమ్మెర రాధిక
5) సంతృప్తి - ఎం.టి. స్వర్ణలత
6) ఒడిబియ్యం - దాసు శ్రీ హవిష
7) నిమజ్జనం - మామిడాల శైలజ
8) కెరటం - కే సుమలత
9) నీటి చెలమ - కామరాజు గడ్డ వాసవ దత్త
10) లేత మొక్క - టివిఎల్ గాయత్రి
ప్రత్యేక బహుమతులుగా ఎంపికైన పది కథలకు ప్రతి కథకు1000/-లు.
ఎంతో ప్రయాసకోర్చి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి ఫలితాలు వెల్లడించిన ప్రముఖ సాహితీవేత్తలు నాళేశ్వరం శంకరం మరియు విమల గుర్రాలకు నిర్వాహకులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పాల్గొన్న కథకులందరికీ అభినందనలు, విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. అతిత్వరలో జరిపే సభలో కథకులకు నగదు బహుమతి, సర్టిఫికెట్స్ అందజేయనున్నట్టు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు